Bithiri sathi : బిత్తిరిసత్తికి కరోనా పాజిటివ్..!? అయినా పని చేస్తూనే ఉన్నాడు

Bithiri sathi tested positive for corona

Bithiri sathi tested positive for corona : కరోనా వైరస్ ఎవ్వర్నీ వదిలిపెట్టడం లేదు. కొద్ది రోజులుగా చాలామంది రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు వైరస్ బారిన పడుతున్నారు. కొందరు హోం ఐసోలేషన్ లో ఉంటే.. మరికొందరు హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు.

అయితే.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల హాట్ ఫేవరేట్ బిత్తిరిసత్తికి (Bithiri sathi ) కరోనా పాజిటివ్ వచ్చినట్టు తెలుస్తోంది. రెండు మూడు రోజుల క్రితం ఆయనకు కరోనా సింప్టమ్స కనిపించడంతో టెస్ట్ చేయించుకున్నట్టు సమాచారం. దీంతో ఆయనకు పాజిటివ్ వచ్చినట్టు తెలిసిందట.

ప్రస్తుతం బిత్తిరి సత్తి అలియాస్ చేవెళ్ల రవి హోం ఐసోలేషన్ లో ఉన్నారు. ప్రస్తుతం సాక్షి టీవీలో గరం గరం వార్తలు కార్యక్రమంలో చేస్తున్న సత్తి .. ఈ నెల 12 నాటి ఎపిసోడ్ లోనే ఈ విషయాన్ని చెప్పాడు. తనకు కరోనా వచ్చిందన్న కాన్సెప్ట్ మీదే స్కిట్ చేశాడు. అయితే.. అది స్కిట్ అని అంతా అనుకున్నారు. కానీ నిజంగానే సత్తికి కరోనా పాజిటివ్ వచ్చిందని సమాచారం.

బిత్తిరి సత్తికి కరోనా సోకిందన్న వార్తతో ఆయన ఫ్యాన్స్ ఆందోళనకు గురవుతున్నారు. సత్తి మాత్రం తాను చాలా ఆరోగ్యంగా ఉన్నానని ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని చెబుతున్నారు.

వీ6 తీన్మార్ వార్తలతో ట్రెండింగ్ లోకి వచ్చిన బిత్తిరి సత్తి.. ఆ తర్వాత ఇస్మార్ట్ సత్తిగా టీవీ9 స్క్రీన్ పై కనిపించారు. తన తండ్రి ఫొటో పెట్టి స్కిట్ చేశారని టీవీ మేనేజ్ మెంట్ సత్తిని తొలగించింది. దీంతో కొద్ది రోజుల గ్యాప్ తర్వాత.. సాక్షి టీవీలో గరం గరం వార్తలు పేరుతో కొత్త కార్యక్రమం ప్రారంభించారు.

ఇవి కూడా చదవండి :