Corona Reinfection : కొత్త టెన్షన్.. తెలంగాణలోనూ కరోనా రీ ఇన్ఫెక్షన్.. !?

వైరస్ వ్యాప్తికి సంబంధించి షాకింగ్ విషయాలు బయటపడుతున్నాయి. ఒక్కసారి వైరస్ వస్తేనే చావు దగ్గరి దాకా వెళ్లి బయటపడుతున్నారు చాలామంది.

Corona Reinfection Cases Increasing

Corona Reinfection Cases Increasing : ప్రపంచమంతా ఇప్పుడిప్పుడే కరోనా నుంచి బయటపడుతోంది. మనదేశంలో, రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వాలు చెబుతున్నా.. వ్యాప్తి మాత్రం ఆగడం లేదు. వైరస్ వ్యాప్తికి ప్రజల నిర్లక్ష్యం కూడా కారణమవుతోంది.

వైరస్ వ్యాప్తికి సంబంధించి షాకింగ్ విషయాలు బయటపడుతున్నాయి. ఒక్కసారి వైరస్ వస్తేనే చావు దగ్గరి దాకా వెళ్లి బయటపడుతున్నారు చాలామంది. కానీ ఇప్పుడు రెండోసారి కూడా వైరస్ ప్రభావం చూపిస్తోందని బయటపడింది.

ఇప్పటికే హంకాంగ్ లో గతంలో కరోనా సోకిన ఓ వ్యక్తికి మళ్లీ కరోనా వచ్చినట్టు గుర్తించాయి. అయితే.. ఒక్క దేశంలోనే కదా.. ఒక్కరికే కదా అని చాలామంది లైట్ తీసుకున్నారు. కానీ అది ఒక్కరితో.. ఒక్కదేశంలో ఆగలేదు. ప్రపంచమంతా కరోనా రీ ఇన్ఫెక్షన్ కేసులు బయటపడుతున్నాయి.

Hong Kong: first 'proven' case of COVID reinfection | Arab News

తెలంగాణలోనూ ఓ వ్యక్తికి గతంలో సోకి రికవరీ అయ్యాక..ఇప్పుడు మరోసారి వైరస్ ఎటాక్ అయ్యిందని తెలుస్తోంది. ఆయన వైద్యాధికారి కావడం ఇక్కడ మరో విశేషం. గతంలో ఖమ్మం జిల్లాలో కూడా వైరస్ రీ ఇన్ఫెక్ట్ అయ్యిందని వార్తలు వచ్చాయి.

హాంకాంగ్, తెలంగాణ మాత్రమే కాదు, బెల్జియం, నెదర్లాండ్స్ లోనూ కరోనా రీ ఇన్ఫెక్షన్ కేసులు బయటపడ్డాయని తెలుస్తోంది. అక్కడ ఇద్దరు వ్యక్తులు రెండో సారి కరోనా బారిన పడ్డారు.

దీంతో ఇప్పుడు ప్రపంచదేశాలు మరోసారి ఆందోళనకు గురవుతున్నాయి. కరోనాను కట్టడి చేశామని ఇప్పటికే దేశాలన్నీ సంతోషంలో ఉన్నాయి. వైరస్ వ్యాప్తి దాదాపు ఆగిపోయినట్టేనని చెబుతున్నాయి. గతంలో విధించిన ఆంక్షలన్నీ ఎత్తేస్తున్నాయి. ఇలాంటి టైంలో సడెన్ గా కరోనా రీ ఇన్ఫెక్షన్ కేసులు బయటపడటం వైద్య రంగానికి సవాల్ గా మారింది.