కరోనా తగ్గిపోయినోళ్లకు మరో డేంజర్..! బీ కేర్ ఫుల్

Doctors, corona infection

కరోనా వైరస్ కు సంబంధించి రోజుకో కొత్త విషయం చెబుతున్నారు సైంటిస్టులు. దీంతో ప్రజల్లో మరింత ఆందోళన పెరుగుతోంది. ఇప్పటికే వైరస్ అంటేనే జనం వణికిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మరో ఆందోళనకరమైన విషయం చెప్పారు శాస్త్రవేత్తలు.

ఓ సారి కరోనా సోకి కోలుకున్నోళ్లకు మళ్లీ లక్షణాలు కనిపిస్తున్నాయని డాక్టర్లు గుర్తించారు. కరోనాతో తీవ్రంగా ఎఫెక్ట్ అయిన వారికి, ఇతర దీర్ఘకాలిక వ్యాధులున్నవారికి ఇలాంటి సమస్యలు వస్తున్నట్టు చెబుతున్నారు. వీరిలో ముఖ్యంగా నీరసం, శ్వాస ఇబ్బందులు, ఒళ్లు నొప్పులు, దగ్గు, గొంతు నొప్పి వంటి వాటిని గుర్తించినట్టు చెబుతున్నారు

కరోనా నుంచ కోలుకున్న వారిలో కొందరికి తీవ్రమైన జ్వరం కూడా వస్తున్నట్టు డాక్టర్లు చెబుతున్నారు. తీవ్రమైన జ్వరం శ్వాస ఇబ్బందులు వస్తే వెంటనే డాక్టర్ ని కన్సల్ట్ అవ్వాలని సూచిస్తున్నారు. అందుకే కరోనా నుంచి కోలుకున్న వారు చాలా జాగ్రత్తగా ఉండాలంటున్నారు.

దీర్ఘకాలిక వ్యాధులున్నవారు కరోనా నుంచి కోలుకోవడానికి చాలా ఎక్కువ సమయం పడుతోందని డాక్టర్లు అంటున్నారు. అందుకే చాలా అప్రమత్తంగా ఉండాలని.. రికవరీ అయిన వారు కూడా అన్ని రకాల జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. మాస్కు పెట్టుకోవడం, శానిటైజర్ వాడటం మానేయవద్దంటున్నారు.

శరీరం సహకరిస్తేనే ఇంట్లో రోజువారి పనులు చేసుకోవాలని లేకపోతే రెస్ట్ తీసుకోవాలన సూచిస్తున్నారు. ఇక ఆరోగ్యం మరింత మెరుగయ్యేందుకు యోగా, మానసిక ప్రశాంతత కోసం ప్రాణాయామం, మెడిటేషన్ వంటివి చేయాలని సూచిస్తున్నారు. బ్రీతింగ్ ఎక్సర్ సైజ్ లు కూడా కంపల్సరీ చేయాలంటున్నారు.

వైరస్ సోకింది.. తగ్గిపోయింది.. మళ్లీ మాకు ఏం కాదులే అనే నిర్లక్ష్యం వద్దంటున్నారు డాక్టర్లు. కచ్చితంగా అన్ని రకాల జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నారు. మంచి ఇమ్యూనిటీ ఉన్న ఫుడ్ తీసుకోవాలని సూచిస్తున్నారు.