HEAVY RAINS IN TELANGANA : మరో రెండు రోజులు వానలు దంచుతయ్

HEAVY RAINS IN TELANGANA FOR MORE TWO DAYS

HEAVY RAINS IN TELANGANA FOR MORE TWO DAYS : తెలంగాణలో వర్ష బీభత్సం ఆగడం లేదు. నాలుగైదు రోజులుగా ఎడతెరిపి లేకుండా వానలు పడుతూనే ఉన్నాయి. చెరువులు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. రిజర్వాయర్లన్నీ నిండు కుండల్లా మారాయి. గోదావరి ఉగ్రరూపం దాల్చింది.

అయితే.. మరికొన్ని రోజుల పాటు వర్షాలున్నాయంటున్న వాతావరణశాఖ అధికారులు. ఈశాన్య బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాలలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని.. దీని ప్రభావంతో.. ఉత్తర బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలలో అల్పపీడనం ఏర్పడిందని చెప్పారు.

ఇది తీవ్ర అల్పపీడనంగా మారిదందని..  వాయువ్య బంగాళాఖాతం.. దాని పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉందని చెప్పారు. అలాగే 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది పశ్చిమ దిశగా ప్రయాణించి రాగల 24 గంటల్లో వాయుగుండంగా మారేర అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

దీని ప్రభావంతో ఇవాళ, రేపు అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది.

ఆదిలాబాద్, నిర్మల్,  కుమ్రంభీం, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలకు పడే చాన్స్ ఉంది. రేపు కూడా ఈ జిల్లాల్లో భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.