బిగ్ బాస్ హౌస్ లో గంగవ్వ ఇంకా ఎన్ని రోజులు ఉంటుంది..?

Nagarjuna Akkineni, Bigg Boss Telugu Contestants, bigg boss telugu 4 contestants list,

Bigg Boss Telugu 4 : బిగ్ బాస్ తెలుగు.. గత సీజన్స్ తో పోలిస్తే.. ఈ సీజన్ కు చాలా ప్రత్యేకత ఉంది. ఎప్పుడైనా కంటెస్టెంట్ ల విషయంలో ఫుల్ గా చర్చ జరిగిది. ఇప్పుడు కూడా చర్చ జరుగుతోంది. అయితే.. ఈ సారి కూడా కంటెస్టెంట్ ల గురించి చర్చ జరుగుతోంది. అది నెగెటివ్ యాంగిల్లో జరుగుతోంది.

ఈ సారి కంటెస్టెంట్ లలో చాలా వరకు ఎవరికీ తెలియని వాళ్లే. హౌస్ లో ఉన్న పదహారు మందిలో ఒకరిద్దరు తప్ప మిగతా ఎవరూ కూడా పెద్దగా స్టార్ డమ్ ఉన్నవారు కాదు. పెద్దగా పరిచయం లేని వాళ్లను తీసుకొచ్చినా.. ఈ సారి హౌస్ మొత్తాన్ని నడిపిస్తున్నది మాత్రం గంగవ్వ అనే చెప్పాలి.

బిగ్ బాస్ నిర్వాహకులు పక్కా ప్లాన్ తో గంగవ్వను తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. మై విలేజ్ షో తో ప్రపంచానికి పరిచయమైన గంగవ్వ గురించి ఇటీవల ఓ అంతర్జాతీయ ఛానెల్ కూడా కథనం వచ్చిందంటే ఆమె ఫేమ్ ఏ స్థాయిలో పెరిగిందో అర్థం చేసుకోవచ్చు.

Bigg Boss Telugu 4 contestant Gangavva: From paddy fields to BB house, all  you need to know about this 58-year-old social media influencer - Times of  India

అలాంటి గంగవ్వను తీసుకొచ్చి బిగ్ బాస్ తెలుగు 4 పాపులారిటీ మరింత పెంచేశారు. ఈ 63 ఏళ్ల బామ్మ హౌస్‌లో ఏం చేస్తుందులే అనుకున్నారంతా.. కాని హౌస్‌లోకి వచ్చిన తరువాత బిగ్ బాస్ స్వరూపాన్నే మార్చేసింది. తన ఆటపాటలతో బిగ్ బాస్ హౌస్‌ని అల్లాడిస్తోంది. తనదైన యాసలో ఆకట్టుకుంటుంది.

గంగవ్వ ద్వారా బిగ్ బాస్ పాపులారిటీ మరింత పెంచుకోవాలనే ఉద్దేశంతోనే మొదటి వారంలోనే ఎలిమినేషన్ కి నామినేట్ చేసినట్టు పర్ ఫెక్ట్ గా అర్థమవుతోంది. దీంతో చాలా మంది గంగవ్వకు మద్దతుగా ఓట్లేశారు. షో వ్యూయర్స్ మరింతగా పెరిగారు. గంగవ్వకు పబ్లిక్ లో ఉన్న ఫాలోయింగ్ ను పరిశీలిస్తే.. బిగ్ బాస్ లో ఎన్నిసార్లు ఎలిమినేషన్ కి నామినేట్ చేసినా అన్ని బయటపడే అవకాశాలైతే నూటికి నూరు శాతం ఉన్నాయి.

బిగ్ బాస్ టైటిల్ విషయంలో తనకు పెద్దగా ఆశలు లేవని చెప్పేసింది గంగవ్వ. ఇటీవలి ఎపిసోడ్ లో కూడా ఇదే విషయంపై డిస్కస్ చేసింది. తనకు వెళ్లిపోవాలనిపిస్తే బిగ్ బాస్ కి , నాగార్జునకి వారం ముందే చెప్పేస్తా.. ఇట్లాగే కష్టపడతా సాధిస్తా కాని.. బాగా ఇదనిపిస్తే.. అయ్యా నేను పోతానయ్యా.. ఒంట్లో బాలేదని చెప్పేసి ఇంటికి వెళ్తా అని చెప్పింది.

ఇదే విషయంపై నాగార్జునతోనూ డిస్కషన్ జరిగింది. అయితే గంగవ్వ ఎప్పుడు వెళ్లిపోవాలనేది.. తాను నిర్ణయించలేనని, బిగ్ బాస్ నిర్ణయించలేడని.. కేవలం ప్రేక్షకులు మాత్రమే డిసైడ్ చేస్తారని చెప్పాడు నాగార్జున. ఆరోగ్యం బాగోలేకుంటే మా వాళ్లు నిన్ను చూసుకుంటారని భరోసా ఇచ్చాడు నాగార్జున. అయినా సరే… తాను ఎక్కువ రోజులు ఉండలేనని.. వీలైనంత త్వరగా తనను పంపేయాలని కోరింది.

గతంలో కమెడియన్ ధనరాజ్ అలాగే సంపూర్ణేష్ బాబులు కూడా బిగ్ బాస్ హౌస్‌లో ఉండలేక మధ్యలోనే వెళిపోతామని రచ్చ చేయడంతో వాళ్లు ఆట మధ్యలోనే ఇంటి ముఖం పట్టారు. ఈ పరిణామాలన్నీ చూస్తే గంగవ్వను మరో రెండు మూడు వారాలకంటే బిగ్ బాస్ హౌస్‌లో ఉండేట్టు కనిపించడంలేదు.