Kathi Karthika : 5 రోజుల్లోనే రాజకీయం నేర్చేసిన “కత్తి కార్తీక”..!

స్టార్ హీరోలే ఎన్నికల్లో బొక్కబోర్లా పడ్డారు. కత్తి కార్తీక ఎలా నిలబడుతుంది..? అనేది ఇప్పుడు అందరి మదిని తొలుస్తున్న ప్రశ్న.

kathi karthika political entry in dubbaka

Kathi Karthika Political Entry In Dubbaka : కత్తి కార్తీక. తెలంగాణలో చాలామందికి ఈ పేరు సుపరిచితమే. వీ6 న్యూస్ ఛానల్ ద్వారా ప్రపంచానికి పరిచయమైంది ఈ హైదరాబాదీ అమ్మాయి. గలగలా మాట్లాడుతూ.. ఇట్టే ప్రేక్షకుల మనసులు దోచేసింది. కత్తి కార్తీక షో కోసం వేచి చూసే పరిస్థితి తీసుకొచ్చింది. పక్కా హైదరాబాదీ లాంగ్వేజ్ లో ఆమె మాట్లాడుతుంటే దిల్ కుష్ అయ్యేది.

అలా టీవీ ద్వారా చాలా మంది ప్రేక్షకులను సంపాదించుకున్న కత్తి కార్తీక.. ఇప్పుడు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గానికి జరుగుతున్న బై ఎలక్షన్ లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అయితే.. ఆమెకు గతంలో ఎలాంటి రాజకీయ అనుభవం లేదు. ఎన్నికల టైంలోనే పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చారు.

ఆమె కోట్లాది మంది ఫ్యాన్స్ ఉన్న స్టార్ హీరోయిన్ కాదు. కొద్ది సంఖ్యలో ఫ్యాన్స్ ఉన్న  ఓ యాంకర్. ప్రస్తుతం ఆమె యాంకరింగ్ కూడా చేయడం లేదు. స్టార్ హీరోలే ఎన్నికల్లో బొక్కబోర్లా పడ్డారు. కత్తి కార్తీక ఎలా నిలబడుతుంది..? అనేది ఇప్పుడు అందరి మదిని తొలుస్తున్న ప్రశ్న.

అయితే.. రాజకీయంలోకి వచ్చి నాలుగైదు రోజులే అయినా.. కార్తీక(Kathi Karthika )మాత్రం చాలా మాటలు నేర్చేసుకున్నారనే చెప్పాలి. ఎందుకంటే.. Q న్యూస్ అనే ఓ యూట్యూబ్ ఛానల్ కు కత్తికార్తీక ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో ఆమె మాట్లాడిన తీరు చూస్తే.. చాలా అనుభవం ఉన్నరాజకీయ నాయకురాలిగా అనిపిస్తోంది.

ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె చాలా ఆచి.. తూచి.. సమాధానాలిచ్చారు. కత్తి కార్తీకకు.. మాజీ మంత్రి పద్మారావు గౌడ్ కు బంధుత్వం ఉంది. దీంతో టీఆర్ఎస్ పార్టీనే ఓట్లు చీల్చేందుకు కార్తీకను బరిలో దించిందనే ప్రచారం జరుగుతోంది. కానీ కార్తీక మాత్రం అందులో వాస్తవం లేదని అంటోంది. తాను ఒంటరిగానే బరిలోకి దిగుతున్నానని చెబుతోంది. “30 అడుగుల తాటిచెట్లు ఎక్కేటోనికి భయముంటదా..?” అంటున్నారు కార్తీక.

Image

నొప్పించక తానొప్పక.. అన్నట్టు చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నారు కార్తీక. ఏ పార్టీపై తాను విమర్శలు చేయబోనని అంటున్నారు. కనీసం ప్రస్తుత ప్రభుత్వ పనితీరు ఎలా ఉందో కూడా చెప్పడానికి ఆమె ఇష్టపడటం లేదు.

తెలివిగా మాట్లాడుతున్న కార్తీక :

దుబ్బాకలో ఇన్నేళ్లుగా అభివృద్ది లేదని చెబుతున్న కార్తీక.. దాని కారణం ఏంటో మాత్రం చెప్పడానికి కూడా ముందుకు రావడం లేదు. టీఆర్ఎస్ పార్టీనే గత ఆరున్నరేళ్లుగా అధికారంలో ఉంది. అలాంటప్పుడు వాళ్లు చేసిన తప్పులేంటో చెప్పొచ్చు. కానీ కార్తీక మాత్రం.. దాని గురించి ఏం మాట్లాడబోనంటూ జాగ్రత్తగా తప్పించుకుంటోంది.

దీనికి మంచి ఉదాహరణలు కూడా చెబుతున్నారు కార్తీక. యుద్ధ రంగంలో ఉన్నప్పుడు యుద్ధం గెలవడం గురించే ఆలోచించాలి గానీ.. పక్కవాళ్ల గురించి ఎందుకంటున్నారు. కానీ ప్రత్యర్థి గురించి తెలిసినప్పుడే.. వారి బలం బలహీనత తెలినప్పుడే దెబ్బకొట్టగలం.. యుద్ధాన్ని గెలవగలం అనే విషయాన్ని మాత్రం మరిచిపోయారు.

తాను రాజకీయాలను మార్చేందుకు వచ్చానంటున్నారు కార్తీక. ఈ ఎన్నికల్లో గెలవక పోయినా ఫర్వాలేదని.. మార్పుతేవాలనే తన సంకల్పం నెరవేరితే చాలంటున్నారు.

చూడాలి మరి దుబ్బాక బరిలో కత్తి కార్తీక.. నిజంగానే కత్తిలా నిలబడతారో..? లేకపోతే వేరే ఒరలోకి చేరిపోతారో..?