Kcr : ఫాం హౌస్ లో గూడుపుఠాని.. అదేనట..!

kcr going in to national politics

Kcr Going In To National Politics : రాష్ట్ర ముఖ్యమంత్రి కొద్ది రోజులుగా బయట కనిపించడం లేదు. ప్రగతి భవన్ లో ఏదైనా అధికారిక రివ్యూలో కనిపిస్తున్నారు. లేదంటే ఫాం హౌస్ లో ఉంటున్నారు. అంతకుమించి ఎక్కడా కనిపించడం లేదు. చాలా రోజుల తర్వాత ఆగస్టు15న జెండా ఎగురవేస్తూ కనిపించారు. అయితే.. బయట కనిపించకుండా కేసీఆర్ ఏం చేస్తున్నరనే దానిపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.

కేసీఆర్ గతంలో చెప్పిన జాతీయ రాజకీయాలపై ఇప్పుడు ఫుల్ ఫోకస్ పెట్టారనే మాట వినబడుతోంది. గత పార్లమెంట్ ఎన్నికల సమయంలోనే జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని కేసీఆర్ చెప్పారు. ఇప్పుడు దానికోసం పక్కా ప్రణాళిక తయారు చేసే పనిలో ఉన్నారట. ఇతర పార్టీల ఎంపీలు.. ఇతర రాష్ట్రాల నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారట.

ప్రస్తుతం దేశ రాజకీయాలు కాస్త భిన్నంగా ఉన్నాయి. బీజేపీ ఏకఛత్రాధిపత్యం సాధించేందుకు ప్రయత్నిస్తోంది. స్వాతంత్ర్య పోరాటం నుంచి ఉన్న పార్టీ అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే ఆ పార్టీ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో.. ఇప్పుడున్న సీట్లను కూడా కాపాడుకునే పరిస్థితి లేదంటున్నారు రాజకీయ నిపుణులు

ఇలాంటి పరిస్థితుల్లో దేశరాజకీయాల్లో మరో కీలక శక్తి అవసరం. జాతీయ రాజకీయాల్లో ప్రస్తుతం ఉన్న పార్టీలకు ప్రత్యామ్నాయంగా మరో పార్టీ అవసరం. బీజేపీ పూర్తిగా హిందూత్వ ఎజెండాతో ముందుకెళ్తోంది. బీజేపీ పాలనతో మైనార్టీలపై దాడులు పెరిగిపోయాయనే ఆరోపణలు కూడా ఉన్నాయి.

సెక్యులర్ పార్టీలపైనా బీజేపీ, దాని అనుబంధ సంస్థలు ఎదురుదాడి చేస్తున్నాయి. సోషల్ మీడియా వేధికగా సెక్యులర్ వాదులపై ఎటాక్ నడుస్తోంది. భవిష్యత్ లో ఇది మరింత దారుణంగా తయారయ్యే పరిస్థితి వచ్చిందనే మాట వినబడుతోంది.

అందుకే.. రాజ్యాంగంలో ఉన్న సెక్యులర్ అంశాన్ని కాపాడుతూ.. అన్ని వర్గాలను ఒక్కతాటిపై నడిపించేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారట. ప్రస్తుతం దేశ రాజకీయాల్లో లోటును భర్తీ చేసేందుకు స్పెషల్ టీంను రెడీ చేస్తున్నారట. తెలంగాణతో పాటు.. మరికొన్ని రాష్ట్రాల్లో ప్రాబల్యం ఉన్న ఎంఐఎంతో కలిసి సెక్యులర్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారట.

Asaduddin Owaisi requests KCR not to implement NPR in Telangana

అందులో భాగంగానే కేటీఆర్ కు రాష్ట్రముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించేందుకు ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. ఇటీవల కేటీఆర్ నిర్వహించిన రివ్యూ కూడా అందులో భాగమనే మాట వినిపిస్తోంది. పాలన వ్యవహారాలకు సంబంధించి కేటీఆర్ ను ఫుల్ గా ప్రిపేర్ చేస్తున్నారట.

కేటీఆర్ ముఖ్యమంత్రి బాధ్యతలు.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కవిత బాధ్యతలు ఇచ్చి.. కేసీఆర్ ఢిల్లీకి షిఫ్ట్ అవ్వాలని ప్లాన్ వేశారట. నెలలో 15 రోజులో ఢిల్లీలోనే ఉండేలా ప్రణాళికలు రెడీ చేస్తున్నారట. దీనికోసం రాష్ట్రంలో అమలవుతున్న పథకాల గురించి దేశవ్యాప్తంగా ప్రచారం చేయాలని నిర్ణయించారట.

KCR-Telangana

పార్టీ సీనియర్ నేత కేశవరావు, రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు, ఆరోగ్యశాఖ మంత్రి ఈటలను కూడా ఢిల్లీ తీసుకెళ్తారని తెలుస్తోంది. వీరితో పాటు.. తుమ్మల నాగేశ్వరరావు, పట్నం మహేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, జగదీశ్ రెడ్డిని కూడా ఢిల్లీ తీసుకెళ్లే ఛాన్స్ ఉన్నట్టు సమాచారం.

రైతుబంధు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాల గురించి అన్ని రాష్ట్రాల్లో ప్రచారం చేసి.. రైతులను తమవైపు తిప్పుకోవాలని చూస్తున్నారట. మరీ ముఖ్యంగా రైతుబంధును దేశవ్యాప్తంగా అమలు చేయాలనే నినాదంతో ఉధ్యమం స్టార్ట్ చేయబోతున్నారట.

రైతుబంధు తరహాలోనే కేంద్రం 2 వేల రూపాయలు ఇస్తోంది. కానీ ఇది రైతుల పెట్టుబడికి సరిపోయే పరిస్థితి లేదు. దీంతో.. కేసీఆర్ మోడల్ పేరుతో దేశవ్యాప్తంగా ప్రచారం చేయాలని చూస్తున్నారట. రైతుల పక్షపాతిగా ఉంటే.. అధికారం ఖచ్చితంగా వచ్చితీరుతుందని కేసీఆర్ గట్టిగా నమ్ముతున్నారట.

ఇప్పటికే దేశవ్యాప్తంగా సర్వేలు కూడా చేయించారట. అన్ని కూడా తనకు అనుకూలంగా ఉండటంతో ఇప్పుడు నేరుగా రంగంలోకి దిగుతున్నారట. ఇప్పుడు పోరాటం మొదలుపెడితే.. వచ్చే పార్లమెంట్ ఎన్నికల నాటికి కేంద్రంలో  ప్రత్యామ్నాయశక్తిగా ఎదిగే చాన్స్ ఉందనే ఆలోచనలో ఉన్నారట. బీజేపీని ఓడించే స్థాయికి కాకున్నా.. ఓట్లు, సీట్లు చీల్చి కింగ్ మేకర్ గా మారతామని టీఆర్ఎస్ వర్గాలు చెప్పుకుంటున్నాయి.

READ ALSO :