Puri Jagannadh : ఇది పుణ్యభూమి.. మనం చెయ్యని పాపము లేదు..!

అందుకే పెట్రోల్ లో కిరోసిన్ కలేపేస్తుంటాం. పాలల్లో నీళ్లు కలిపేస్తాం. మునిపాలిటీ వాటర్ లాగేస్తాం. రేషన్ బయట అమ్మేస్తాం.

puri jagannadh podcasts

Puri Jagannadh Podcasts : కాసేపు మన గురించి, మన దేశం గురించి నిజాలు మాట్లాడుకుందాం..

భారతదేశం కర్మభూమి.. కానీ మనకు కామన్ సెన్స్ ఉండదు…

మనది వేదభూమి.. ఆ వేదాలు ఎక్కడున్నాయో తెలియదు…

ఇది పుణ్యభూమి.. మనము చెయ్యని పాపములేదు…

మన తల్లి భరతమాత.. కానీ గంటకో రేప్ చేస్తుంటాం…

సువిశాల భారత ఖండం.. పాపులేషన్ తో కిటకిటలాడుతుంటాం…

గంగా,యమునా,గోదావరి.. ఆ నీళ్ల కోసమే కొట్టుకు చస్తుంటాం…

ఎన్నో పుణ్యక్షేత్రాలు.. ఆ గుడుల బయటే చెప్పులు దొంగతనం చేస్తుంటాం…

మహాకవులు పుట్టిన దేశం మనది.. 65% నిరక్షరాస్యత…

మనది ఆర్య సంసృతి.. అందుకే పెట్రోల్ లో కిరోసిన్ కలేపేస్తుంటాం. పాలల్లో నీళ్లు కలిపేస్తాం. మునిపాలిటీ వాటర్ లాగేస్తాం. రేషన్ బయట అమ్మేస్తాం. ఓట్లు అమ్ముకుంటాం. దొంగ బిల్స్ పెడతాం. బిల్స్ ఎగ్గొడతాం. దొంగ సర్టిఫికెట్లు పెడతాం. దొంగనోట్లు గుద్దేస్తాం. టిక్కెట్లు లేకుండానే ట్రెయిన్ ఎక్కుతాం. పక్క స్థలం కలిపేస్తాం. ఆఖరికి డ్రైనేజీ మూతలు కూడా అమ్మేస్తాం.

ఇవికాకుండా  ఫ్రీడమ్ వల్ల మూడు చక్కటి విషయాలు నేర్చుకున్నాం..

1) పెంట తీసి నెత్తికి రాసుకోవడం

2)కోడిగుడ్డు మీద వెంట్రుకలు పీకడం

3)పుల్లపెట్టి పక్కోడిని కెలకడం

పైన చెప్పిన ఐటమ్స్ లో చాలావి మనందరం చేసే ఉంటాం..

అందుకే ఒక పేపర్ తీసి రాసుకుందాం..

నేను చేసిన ఎదవ పనులు అని..

ఎవ్వరికీ చూపించొద్దు.. మనకోసమే.. అలా రాసుకొని ఫ్యూచర్ లో అవి చెయ్యకుండా జాగ్రత్త పడదాం.

200 ఏళ్లు యుద్ధం చేసి ఫ్రీడమ్ తెచ్చుకున్నాం ఉపయోగం ఏంటి..?

మనం మారకపోతే ఏ నాయకుడూ మనల్ని మార్చలేడు. మీతో పాటు మీ పిల్లలు కూడా నేర్చుకుంటారు కరెంట్ దొంగతనం..

మొన్ననే గాల్వన్ వ్యాలీ లో గొడవైంది.ఇండియన్ సోల్జర్స్ చనిపోయారు. అక్సాచిన్లో చైనీస్ తో హ్యాండ్ టు హ్యాండ్ పైట్ రాళ్లతో కొట్టుకున్నారు. ప్రాణం పోయేంతవరకూ కొట్లాడారు. ఎందుకు? మనకోసం మన దేశం కోసం..చనిపోయిన సోల్జర్స్ వాళ్ల తల్లిదండ్రుల గురించి ఆలోచించలేదు. కట్టుకున్న భార్యను మర్చిపోయారు. కన్న పిల్లల్ని మర్చిపోయారు. ప్రాణాలగురించి అసలు పట్టించుకోలేదు.

కొన ఊపిరి వరకు వాళ్లకు ఒకటే గుర్తుంది.. దేశం..దేశం..దేశం..

నీ యమ్మ ప్రైడ్ తో చచ్చిపోయారు మన సోల్జర్స్..

మేరా భారత్ మహాన్..

వాళ్ల కోసమైనా మనం ఈ చీప్ పనులు మానేద్దాం..వాళ్ళలా నువ్వు దేశంకోసం చావనక్కరలేదు..కనీసం ఆ గోడ మీద ఉచ్చ పొయ్యకపోతే చాలు అది కూడా దేశభక్తే.

జన గన మన..