tv9 : మళ్లీ రవిప్రకాష్ చేతుల్లోకి “టీవీ9”..! ఎందుకలా..?

కొత్త మేనేజ్ మెంట్ మాత్రం భారం తగ్గిందని సంతోషపడింది.అయితే.. ఆ సంతోషం ఎన్నో రోజులు నిలవలేదు.

Ravi Prakash Filed A Suite For Tv9 Take Over

టీవీ9 (tv9) గ్రూప్ ఛానల్స్ వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. అప్పట్లో ఛానల్ ఇష్యూ చాలా సీరియస్ అయ్యింది. కేసుల వరకు వెళ్లింది. ఛానల్ వ్యవస్థాపకుడు, మాజీ సీఈవో రవిప్రకాశ్ జైలుకు కూడా వెళ్లాల్సి వచ్చింది.

రవిప్రకాశ్ సీఈవోగా ఛానల్ చాలా రోజులు నడిచింది. చాలా భాషల్లోకి ఛానల్ విస్తరించింది. తెలుగులో టీవీ1 పేరుతో మరో ఛానల్ కూడా తీసుకొచ్చారు. దీనికి తోడు మోజో అనే ఛానల్ కూడా తెరపైకి వచ్చింది.

అప్పటికే మంచి ప్రాఫిట్ లో ఉన్న టీవీ9(tv9)ను మేఘా కృష్ణారెడ్డి, జూపల్లి కృష్ణారావు బ్యాచ్ కొనుగోలు చేసింది. వచ్చీ రాగానే రవిప్రకాశ్ పై కేసులు పెట్టింది. అక్రమంగా ఛానల్ షేర్లు సొంతం చేసుకున్నారని ఆయనపై భారీగానే కేసులు ఫైలయ్యాయి.

అటు.. టీవీ1ను ఎత్తేశారు. రవిప్రకాశ్ నడిపిస్తున్నారని ప్రచారంలో ఉన్న మోజో టీవీని తమచేతుల్లోకి తీసుకుని తాళాలేశారు. దీంతో ఉద్యోగులు రోడ్డున పడ్డారు. కొత్త మేనేజ్ మెంట్ మాత్రం భారం తగ్గిందని సంతోషపడింది.అయితే.. ఆ సంతోషం ఎన్నో రోజులు నిలవలేదు.

ప్రస్తుతం టీవీ9 భారీగా నష్టల్లో కూరుకుపోయింది. అసలే కరోనా.. దీనికి తోడు మెయింటెన్స్ లోపంతో ఛానల్ దెబ్బతిన్నదనే మాట వినిపిస్తోంది. దీంతో అతి తక్కువ కాలంలోనే భారీగా నష్టాలను మూటగట్టుకుంది. ఏకంగా టీవీ9 గుజరాత్ ను మూసేయాలని ప్లాన్ చేస్తున్నారట.

ఇలాంటి టైంలోనే మళ్లీ టీవీ9లోకి ఎంట్రీ ఇచ్చే ప్రయత్నాలు మొదలుపెట్టారు రవిప్రకాశ్. అడుగు పెట్టడం కాదు.. ఏకంగా ఛానల్ ను టేకోవర్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారట.

TV9-Ravi-Prakash

లాభాల్లో ఉన్నకంపెనీని పూర్తిగా నష్టాల్లో ముంచేశారు. జర్నలిస్టులు నడపాల్సిన ఛానల్ ను రియల్ ఎస్టేట్ వ్యాపారులు నడిపిస్తున్నారు. అందుకే నష్టాలు వస్తున్నాయి. ఇప్పటికీ ఛానల్ లో నేను ఓ వాటాదారునే కాబట్టి.. ఛానల్ ను టేకోవర్ చేసేందుకు అనుమతి ఇవ్వాలంటూ కంపెనీస్ లా ట్రిబ్యునల్ లో రవిప్రకాశ్ కేసు వేశారట.

అయితే.. కావాలని పట్టుబట్టి మరి టీవీ9ను టేకోవర్ చేసింది మైహోం అండ్ మెఘా టీం. ఇలాంటి పరిస్థితుల్లో మళ్లీ రవి ప్రకాశ్ చేతుల్లో ఎందుకు పెడుతుందనేది ఓ ప్రశ్న.

చూడాలి .. బ్రేకింగ్ న్యూస్ తో జనానికి దగ్గరైన టీవీ9 ఇప్పుడు ప్రతినిత్యం బ్రేకింగ్ న్యూస్ గా మారుతోంది. రాబోయే రోజుల్లో ఇంకెన్ని బ్రేకింగ్ న్యూస్ లు క్రియేట్ చేస్తుందో చూడాలి.