Religious Harmony : ప్రత్యామ్నాయ సంస్కృతి సాధ్యం కాదా..?

మండపాల వద్ద జుగుప్సాకర పాటలు, అసభ్య డాన్సులూ కనిపించలేదు. కోట్లాది రూపాయల ఖర్చు లేదు. నిమజ్జనంలో చావులు లేవు.

Religious Harmony In India

Religious Harmony In India : నా జీవితంలో మొట్ట మొదటిసారి అద్భుతమైన వినాయక చవితి చూసాను.మండపాలు లేవు.తోరణాలు కట్టలేదు.మైకుల హోరు లేదు. డోలు,డప్పు వాద్యాలు లేవు.ఊరేగింపులు లేవు.ట్రాఫిక్ సమస్యలూ లేవు.నదీకాసారాల కాలుష్యం లేదు. బాణా సంచా మోతలు లేవు.

మండపాల వద్ద జుగుప్సాకర పాటలు, అసభ్య డాన్సులూ కనిపించలేదు. కోట్లాది రూపాయల ఖర్చు లేదు. నిమజ్జనంలో చావులు లేవు(విజయనగరం జిల్లా కురుపాం గుజ్జలిలో ఒక కుర్రాడు నదిలో గల్లంతైన సంఘటన తప్ప).మత కలహాలు లేవు.

అబ్బా!ఎంత మంచి కాలం.కరోనా నీకు హేట్సాఫ్! మనిషి స్రృష్టించిన( దేవుడు) గణపతి ఎంత మంచివాడో కదా! ఎవరి కలలోకి రాలేదు.తన పండుగను ఆడంబరంగా జరపలేదని ఎవరినీ శపించలేదు. ఎవరి స్థాయిలో వారు తమ విశ్వాసాల మేరకు ఇళ్ళలో  రకరకాల వస్త్ర ధారణతో పూజలు చేసి,పిండివంటల్ని ఆరగించారు.

ఇంతకంటే ఏం కావాలి?ఇలాగే ఎవరి ఇళ్ళలో వారు తమ మతాచారాలను,సంప్రదాయాలను ఆచరిస్తే ఎటువంటి ఇబ్బందీ లేదు. మతం వ్యక్తగతం కావాలి. దాన్ని పబ్లిక్ లోకి తీసుకురావడమే కలహాలకు కారణం. అప్పుడే ఎవరికి తోచిన రీతిలో వారు విమర్శించడమో! రెచ్చగొట్టడమో! జరుగుతుంది.

ఈదేశంలో అన్ని మతాలవారూ తమ పండగలను ఎప్పటికీ నిన్నటిలాగే జరుపుకుంటే ఎంత బాగుండు. లౌకికతత్వం అంటే ఇదేనేమో!

అయినా అత్యాశే కదా!

…. Santosh Muddana

Read Also :