Renu Desai : రేణుదేశాయ్ గోరటి వెంకన్న ఇంటికి ఎందుకెళ్లింది..?

తన ప్రాజెక్ట్ లతో బిజీగా ఉండే రేణు దేశాయ్.. గోరటి వెంకన్న ఇంటికి వెళ్లడం హాట్ టాపిక్ అయ్యింది.

Renu Desai Met Gorati Venkanna

Renu Desai Met Gorati Venkanna : సినీ నటి, పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ఇప్పుడు సోషల్ మీడియాలో స్పెషల్ ఎట్రాక్షన్ గా మారారు. పవన్ నుంచి సెపరేట్ అయ్యాక సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ అయ్యారు.

తన ప్రాజెక్ట్ లతో బిజీగా ఉండే రేణు దేశాయ్(Renu Desai).. గోరటి వెంకన్న(Gorati Venkanna) ఇంటికి వెళ్లడం హాట్ టాపిక్ అయ్యింది. ప్రముఖ వాగ్గేయకారుడు గోరటి వెంకన్న.. హైదరాబాద్ శివారులో భూమి కొనుగోలు చేసి అందులో వ్యవసాయం చేస్తున్నారు. అక్కడే ఉంటున్నారు.

ఆయన ఫామ్ హౌస్ కి వెళ్లింది రేణు దేశాయ్. రేణు దేశాయ్ గోరటి వెంకన్న ఇంటికి ఎందుకు వెళ్లిందనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.

అయితే.. రైతుల గురించి రేణుదేశాయ్(Renu Desai) ఓ సినిమా చేయబోతోంది. ఆ సినిమాలో పాటల రాయించేందుకు గోరటి వెంకన్న దగ్గరకు వెళ్లింది రేణు. గోరటి వెంకన్న పాటలు.. ఆయన అక్షరాల కూర్పు ఎంత అద్భుతంగా ఉంటుందో అందరికి తెలిసిందే.

అందుకే స్వయంగా వెళ్లి మరీ గోరటి వెంకన్నతో పాటలు రాయించింది రేణు దేశాయ్. అంతేకాదు.. ఫామ్ హౌస్ లో చాలాసేపు గడిపిన రేణు దేశాయ్.. అక్కడే భోజనం కూడా చేసింది. అరిటాకులో ముద్దపప్పుతో భోజనం అద్భుతంగా ఉందంటూ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టింది.