Oh Womaniya : శ్రీముఖి లెటెస్ట్ సాంగ్ వెనక “అసలు కథ” ఇదేనట..!

ఈ ప్రయత్నం వెనక వేరే ఉద్దేశం ఉందనే మాట వినిపిస్తోంది. శ్రీముఖి చాలా కాలంగా ఇండస్ట్రీలో ఉంది.

sreemukhi Oh Womaniya song facts

sreemukhi Oh Womaniya song facts : అప్పట్లో స్మాల్ స్క్రీన్ ను ఊపు ఊపేసిన హాట్ బ్యూటీ శ్రీముఖి. తన గ్లామర్ తో షేక్ చేసి పడేసింది. చాలా ప్రోగ్రామ్స్ లో బిజీగా ఉన్న శ్రీముఖి.. తర్వాత బిగ్ బాస్ హౌస్ 3లోకి వెళ్లింది.

అయితే.. బిగ్ బాస్ హౌస్ 3 నుంచి రన్నరప్ గా బయటకు వచ్చింది ఈ బ్యూటీ. అయితే.. బిగ్ బాస్ హౌస్ కు వెళ్లి వచ్చాక శ్రీముఖికి పెద్దగా కలిసొచ్చినట్టు లేదు.

అప్పట్లో టీవీల్లో ప్రోగ్రామ్స్ తో ఊపేసిన ఈ బ్యూటీ.. ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదు. అయితే.. ఇప్పుడు మరోసారి ప్రేక్షకులకు దగ్గరయ్యేందుకు ఓ ప్రయత్నంచేసింది ఈ భామ.

ఓ ఉమనియా(Oh Womaniya).. అంటూ ఓ సాంగ్ షూట్ చేసింది. మహిళల జీవితానికి సంబంధించి ఇందులో చూపించే ప్రయత్నం చేసింది.

ఓ టాక్ షో కోసమే ఈ సాంగ్ చేసిందని చెబుతున్నారు. ఓ ఉమనియా పేరుతో శ్రీముఖి ఓ టాక్ షో చేయబోతోందట. దాని ప్రచారం కోసమే సాంగ్ చేశారట.

అయితే.. ఈ ప్రయత్నం వెనక వేరే ఉద్దేశం ఉందనే మాట వినిపిస్తోంది. శ్రీముఖి చాలా కాలంగా ఇండస్ట్రీలో ఉంది. చాలా ప్రోగ్రామ్స్ లో యాంకర్ గా కనిపించింది. చాలా ఈవెంట్లలోనూ తానే యాంకర్.

అయినా ఆమెకు బిగ్ స్క్రీన్ పై అవకాశాలు తక్కువే. ఒకట్రెండు సినిమాల్లో అంత ప్రాధాన్యం లేని క్యారెక్టర్లు ఇచ్చారు. దీనిపై శ్రీముఖి చాలా కాలంగా అసంతృప్తితో ఉంది.

ఇప్పుడు ఆ అసంతృప్తిని తొలగించుకునేందుకే ఈ సాంగ్ ప్రయత్నం చేసిందట శ్రీముఖి. తనలోని యాక్టింగ్ స్కిల్స్ ని.. ప్రపంచానికి చూపించాలనే ఉద్దేశంతోనే ఈ సాంగ్ చేసినట్టు తెలుస్తోంది. అందుకే సాంగ్ లో శ్రీముఖి చాలా పాత్రల్లో కనిపిస్తుంది.

టాక్ షో కోసం చేస్తున్న షోతో తనలోని టాలెంట్ ని, యాక్టింగ్ స్కిల్స్ ను ప్రపంచానికి చూపించి బిగ్ స్క్రీన్ పై అవకాశాలు కొట్టేయాలని చూస్తోందట ఈ భామ. శ్రీముఖి ప్రయత్నాలు ఏ మేరకు సఫలీకృతం అవుతాయో చూడాలి.

Read Also