శ్రీవారి ప్రసాదంపై TTD కీలక నిర్ణయం

తిరుమలలో ప్లాస్టిక్ నిషేధానికి చర్యలు తీసుకుంటున్న టీటీడీ ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది.

ttd-key-decision-on-prasadam

TTD KEY DECISION ON PRASADAM : తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే తిరుమలలో ప్లాస్టిక్ నిషేధానికి చర్యలు తీసుకుంటున్న టీటీడీ ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది.

శ్రీవారి ప్రసాదాన్ని ఇప్పటి వరకు ప్లాస్టిక్ కవర్లలో ఇచ్చేవారు. కానీ ఇకపై ప్లాస్టిక్ ను పూర్తిగా నిషేధించాలని TTD నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇకపై శ్రీవారి ప్రసాదాన్ని జనపనారతో తయారుచేసిన బ్యాగుల్లో ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.

జనపనారంతో చేసిన సంచుల వల్ల పర్యావరణ పరిరక్షణతో పాటు.. లడ్డూలు పాడై పోకుండా ఎక్కువ కాలం ఉంటాయని అధికారులు చెబుతున్నారు. అలాగే జనపసంచులు నెయ్యిని పీల్చుకోబోవని అంటున్నారు.

లడ్డూల సంఖ్యను బట్టి సంచులు తయారుచేయించినట్టు అధికారులు చెబుతున్నారు. సంచులకు డబ్బులు వసూలు చేయనున్నారు.

ఐదు లడ్డూలు పట్టే సంచికి 25 రూపాయలు, 10 లడ్డూలు పట్టే సంచికి 30 రూపాయలు, 15 లడ్డూలు పట్టే సంచికి 35 రూపాయలు, 25 లడ్డూలు సంచికి 55 రూపాయలు వసూలు చేయనున్నారు.

ఇప్పటికే తిరుమలలో ప్లాస్టిక్ పై నిషేధం విధించింది టీటీడీ. వాటర్ బాటిళ్లు కూడా ప్లాస్టిక్ కు బదులు గాజుతో తయారు చేసిన బాటిల్స్ వాడాలని సూచించింది.

READ ALSO :