TV9 RaviPrakash : రవిప్రకాశ్ గురించి చాలామందికి తెలియని వాస్తవాలివి..!

నేను అప్పటికి రవిని కలిసి చాలా సంవత్సరాలు అయింది. తేజ ఛానెల్ లో చేస్తున్నప్పుడు రెండు సార్లు కలిసుంటాను.. అంతే.

Unknown Facts About Tv9 Raviprakash

Unknown Facts About Tv9 Raviprakash : టీవీ9 రవిప్రకాష్.. తెలుగు వారందరికి ఈయన పేరు సుపరిచితమే. ప్రస్తుతం టీవీ9లో లేకపోయినా.. ఆయన గురించి మాత్రం మీడియా చరిత్రలో ఎప్పటికీ నిలిచి ఉంటుంది.

తెలుగు మీడియాకు ఆయన ఓ మార్గదర్శకుడనే చెప్పుకోవాలి. తెలుగులో వార్త చానళ్లు పుట్టుకురావడానికి రవిప్రకాశ్ కీలకమైన వ్యక్తి. టీవీ9తో ఆయన చేసిన ప్రయోగం సక్సెస్ కావడంతో చాలామంది ఈ మీడియా రంగంలోకి వచ్చారు.

ఓ మామూలు జర్నలిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన ఆయన.. ఓ ఛానల్ కు దాదాపు ఓనర్ స్థాయికి వెళ్లారు. ఇది మామూలు విషయం కాదు. రవిప్రకాశ్ పర్సనల్ లైఫ్.. ఆయన కెరీర్ గురించి పూర్తిగా తెలిసింది చాలా తక్కువ మందికే. టీవీ9 కంటే ముందు రవిప్రకాశ్ ఏం చేశారు.? అసలు మీడియాలోకి ఎలా వచ్చారు..? ఇవన్నీ చాలామందికి ఇప్పటికీ సమాధానం దొరకని ప్రశ్నలే.

అయితే.. వీటన్నింటికి ఆన్సర్ ఇచ్చారు హర్షవర్ధన్. సినిమాల ద్వారా మనకు పరిచయమై.. క్రైం వార్తలతో మరింత చేరువై.. క్రైం న్యూస్ బులిటెన్లు ఎలా ఉంటే జనాలు చూస్తారో ప్రపంచానికి చూపించిన వ్యక్తే హర్షవర్ధన్. టీవీ9 రవిప్రకాశ్, హర్షవర్ధన్ చిన్ననాటి మిత్రులు. రవిప్రకాశ్ గురించి హర్షవర్ధన్ ఏం చెప్పారో చదవండి.

….

“నేను , రవిబాబు ( మీకు రవిప్రకాష్ Tv9 Raviprakash ) గవర్నమెంట్ హైస్కూల్ లో 10th క్లాస్ వరకు కలిసి చదువుకున్నాం. నేను పుట్టింది , పెరిగింది హైదరాబాద్ లోనే.

1st క్లాస్ నుండి 10th వరకు Vijay Nagar colony గవర్నమెంట్ హైస్కూల్ లో చుదువుకున్నా.. రవిబాబు అంతకుముందు ఎక్కడ చదువుకున్నది తెలియదు కానీ బహుశా 6th నుండి 10th వరకు నాతోపాటు కలిసి చదువుకున్నాడు. మేము చదువుకునేటప్పుడు క్లాస్ రూంలో బెంచి పైన కూర్చునే వాళ్ళం. (7th క్లాస్ వరకు కిందే కూర్చునే వాళ్ళం) హైట్ ప్రకారం పొట్టిగా వున్నవాళ్ళు ముందు బెంచిలో.. పొడుగ్గా వున్నవాళ్ళు లాస్ట్ బేంచిలో కూర్చో పెట్టేవాళ్ళు.

లాస్ట్ బెంచిలో రవిబాబు , శంకర్ గాడు, వర్మ గాడు..ఇంకా ఇద్దరు పేర్లు గుర్తుకు రావట్ల..దానికి ముందు బెంచీలో నేను , David గాడు , సాయిరాం గాడు , శీను గాడు కూర్చునే వాళ్ళం. ఇంకా మా సెక్షన్ లో 10 మంది అమ్మాయిలు ఉండేవాళ్ళు..అదొక ఆనందం..అదృష్టం మాకు. మా క్లాస్ లో నేను David గాడు రౌడీ గాల్ళం..బాగా అల్లరి చేసేవాళ్ళం. రవిబాబు సైలెంట్‌గా ఉండేవాడు. నిజానికి నేను పెద్దగా రవిబాబు ని పట్టిచ్చికునే వాడ్ని కాదు. ఎవరి బెంచ్‌లో కూర్చొనేవా ళ్లు వాళ్ళు క్లోజ్ గా ఉండేవాళ్ళం. 10th క్లాస్ పాస్ అయిన తరువాత ఎవరికివారు విడిపోయాం. ఎవరికి నచ్చిన కోర్స్ తీసుకొని..ఎవరికి నచ్చిన కాలేజ్ లో చేరి పోయాం.

Kamma Idols: TV9 Ravi Prakash – Another Ramoji in the making!

ఇద్దరం మేహది పట్నం ఏరియాలో ఉండేవాళ్ళం.. నేను నవోదయ కాలనీలో , వాడు దగ్గర్లో ఉన్న మరో కాలనీలో ఉండేవాళ్ళం. నేను ఇంటర్ , డిగ్రీ ఏ.వి. కాలేజ్ లో చదువుకున్నా.. వాడు ఎక్కడ ఏ కాలేజ్ లో చదువు కున్నాడో తెలియదు..కానీ అప్పుడప్పుడు రోడ్డుపైన.. జిమ్ లో కలుసుకునే వాళ్ళం. డిగ్రీ అయిపోయిన తరువాత ఒకసారి రోడ్డుపైన కలిసినప్పుడు “ఏం చేస్తున్నవు రా అని అడిగా ” .. దానికి వాడు “సుప్రభాతం” పత్రికలో జాబ్ చేస్తున్నా అని చెప్పాడు. సరే కబుర్లు చెప్పుకున్న తరువాత వెళ్ళిపోయాం.

అప్పట్లో నా రూటే సపరేట్ గా ఉండేది.. మా నవోదయ కాలనీ గాంగ్.. కాలేజ్ ఫ్రెండ్స్ తో సినిమాలు..షికార్లు అల్లర్లు..ఆటలు..హ.. ఆ రోజులే వేరు.

ఆ క్రమంలో మా నాన్న గారికి నిజామాబాద్ ట్రాన్స్ఫర్ ఆవ్వడం అక్కడ నేను ఒక సంవత్సరం ఉండడం.. అక్కడ టీచర్ ఉద్యోగం వెలగ బెట్టడం.. తరువాత మళ్ళీ హైదరాబాద్ వచ్చి..బాచిలర్ గా ఉంటూ sales representative.. business representative.. sales executive ( పేర్లు వేరే చేసే జాబ్ ఒక్కటే ).. తరువాత 3 స్టార్ హోటల్లో రిసెప్షి నీస్ట్ కం టెలీఫోన్ ఆపరేటర్ గా నెలకి 1200/_ జాబ్ చేస్తూ బి. ఏ.external exams కోసం లీవ్ దొరక్క జాబ్ వదిలేయ ల్సి వచ్చింది.

ఆ తర్వాత Hyderabad సెంట్రల్ యూనవర్సిటీలో P.G. Diploma in acting part time కోర్స్ చేస్తూ.. day అంతా ఖాళీగా ఉన్నాను కదా ఏదైనా జాబ్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్న టైమ్ లో.. టీవీలో సిటికెబుల్ లో న్యూస్ రీడర్ కావలెను అని ఒక add చూసి అప్లై చేసా. అప్పట్లో సిటీ కేబుల్ ఆఫీస్ పంజాగుట్ట నాగార్జున సర్కిల్ దగ్గర ఉండేది. అప్పటికి ఇంకా శాటిలైట్ ఛానెల్స్ రాలేదు. సరే interview కి వెళ్లి నాకిచ్చిన స్క్రిప్ట్ చదివి వస్తుంటే అక్కడ రూంలో రవిబాబు కనబడ్డాడు.

Telugu Media News: టివి9 రవిప్రకాష్ పై ఓ ప్రత్యేకమైన వెబ్ సైట్..www.raviprakashtv9.com

వీడెంటి ఇక్కడ వున్నాడు..ఓహో వీడుకుడా ఇక్కడ జాబ్ చేస్తున్నాడని అనుకోని.. రేయ్ రవి interview అయిపోయింది..బాగా చేసా , ఎందుకైనా మంచిది నువ్వుకూడా రికమెండ్ చెయ్యి అని చెప్పి వచ్చేసా. అప్పటికి ఇంకా సెల్‌ఫోన్ లు.. పేజర్లు రాలేదు. అందుకే నా ఫ్రెండ్ పెర్రాజు గాడు ఇంటి లాండ్ నంబర్ ఇచ్చా. తరవాత నా పన్లో నేను పడిపోయా.. సిటీ కేబుల్ నుండి రెండు సార్లు ఫోన్ వచ్చిందని తెలిసి వెళ్లి కలిశా. నేను న్యూస్ రిడర్గా సెలెక్ట్ అయ్యానని చెప్పారు.. అప్పుడు తెలిసింది ఆ ఆఫిస్‌కి డైరెక్టర్ రవిబాబు అని.. తన పేరుని రవిప్రకాష్ గా మార్చుకున్నాడు అని.

ఆలా దాదాపు ఆరేడు సంవత్సరాలు నాకు గవర్నమెంటు జాబ్ వచ్చేవరకు సిటీ కేబుల్ లో న్యూస్ చదివా ( కంగారు పడకండి స్క్రీన్ పైన కనిపించే వాడ్ని కాదు.. ఓన్లీ వాయిస్ ఓవర్..అప్పటికి టెక్నాలజీ అంత డెవలప్ కాలేదు )

నేనన్నా..నా వాయిస్ అన్నా.. చదివే తీరు వాడికి చాలా ఇష్టం. రవిప్రకాష్ సిటీ కేబుల్ డైరెక్టర్ గా ఉంటూ zee news ఛానెల్ కి..అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి కరస్పాంెంట్ గా ఉండేవాడు. అప్పట్లోనే తన జీతం 25 వేలు. చేతక్ స్కూటర్ మీద వచ్చేవాడు. రవి ని చూస్తే నాకు ఆశ్చర్యం గా ఉండేది.. స్కూల్లో సైలెంట్‌గా.. మొద్దులా ఉండేవాడు..ఇప్పుడు ఇంత డైనమిక్ గా.. కానీ అందరితో ఫ్రెండ్లీ గా ఉండేవాడు.

అక్కడే అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్న జగన్మోహన్ రెడ్డి , సతీష్ కమ్మల్ ,గంగాధర్ , బాలా గంగాధర్ , మాధవ్ , శ్రీకాంత్ , ఇప్పుడు టివి9 encounter with Murali Krishna , tv9 news reader సుమతి .. మేమందరం కలిసి పని చేశాం. ఆ రోజులన్నీ గోల్డెన్ days.. మర్చిపోలేని మథుర స్మృతులు.. జ్ఞాపకాలు.

వీళ్ళందరూ ఎంతో ఇష్టపడి..కష్టపడి ఇప్పుడు వివిధ ఛానెల్స్ లో తమకంటూ ఒక గుర్తింపుని..స్థానాన్ని ఏర్పరచుకున్నారు.

నేను అప్పుడు మెహది పట్నం గుడిమల్కపురం లో బాచిలర్ గా ఉండేవాడని. అప్పటికి నాకు వెహికిల్ లేదు.. రవి పొద్దున్నే 5 కి నా రూంకి తన స్కూటర్ పై వచ్చి నన్ను పికప్ చేసుకొని ఆఫీస్‌కి తీసుకెళ్లే వాడు. కొన్ని రోజుల తరువాత వాడ్ని కష్టపెట్టడం ఇష్టం లేక నేనే పంజాగుట్ట కి షిఫ్ట్ అయిపోయా.

సిటీ కేబుల్ లో పని చేసి నన్ని రోజులు అందరం సరదాగా ఉండేవాళ్ళం.. హంగు ఆర్భాటం లేదు. రవి కూడా అందరితో సరదాగా ఉండేవాడు..పని విషయంలో మాత్రం స్టిక్ట్ గా ఉండేవాడు.

తరువాత నాకు గవర్నమెంట్ జాబ్ రావడంతో అక్కడ జాబ్ మానేయాల్సి వచ్చింది. తరువాత నేను జాబ్‌లో బిజీ అయిపోయాను.

రవి కూడా సిటీ కేబుల్ నుండి తేజ ఛానెల్ కి మారడం..అప్పటిదాకా తెర వెనుక ఉండే రవి తెరపైన కనిపించడం మొదలైంది. బషిర్‌బాగ్ కాల్పుల ఘటనను కవరేజ్ చెయ్యడంతో తన పేరు మొదటిసారిగా మార్మోగింది.

ఆ తర్వాత టివి9తో రవిప్రకాష్ మరో ప్రస్థానం..ప్రభంజనం మొదలైంది.

**********************************

నేను తేజ గారి “జై” సినిమా లో అద్భుతమైన మైన్ కారెక్టర్ చేసా. కానీ ఆ సినిమా ప్లాప్ అవ్వడంతో మంచి పాత్రల కోసం ఎదురుచూస్తున్నా..అప్పటికే టివి9 న్యూస్ ఛానెల్ మొదలై మూస ధోరణిని కి భిన్నంగా..క్రొంగొత్తగా ప్రకంపనలు సృష్టిస్తోంది. నా ఆఫీస్ పంజాగుట్ట లో ఉండేది. అక్కడికి దగ్గర్లోని టివి9 ఉండేది..కానీ ఆ విషయం నాకు తెలియదు. నా ఫ్రెండ్ ఒకడు వచ్చి “టీవీ9 లో క్రైమ్ యాంకర్ కోసం సెలక్షన్స్ జరుగుతున్నాయి..నేను వెళదామని అనుకొంటున్నాను” అని చెప్పాడు.

నేను అప్పటికి రవిని కలిసి చాలా సంవత్సరాలు అయింది. తేజ ఛానెల్ లో చేస్తున్నప్పుడు రెండు సార్లు కలిసుంటాను.. అంతే.

అప్పుడు నేను నా ఫ్రెండ్ తో “రవిప్రకాష్ (Tv9 Raviprakash) నా ఫ్రెండ్..కలిసి చాలా కాలం అయింది..వాడ్ని కలిసినట్టు ఉంటుంది..వీలుంటే నిన్ను రికమెండ్ చేస్తాను నన్ను కూడా తీసుకెళ్ళు” అని చెప్తే నన్ను కూడా తీసుకెళ్ళాడు.

నేను వెళ్లి రవి ని కలిశా. కుశల ప్రశ్నలు అయ్యాక అప్పుడు చెప్పా..”మీరేదో క్రైమ్ ప్రోగ్రాం చేస్తున్నారట నా ఫ్రెండ్ ఆడిషన్ కి వచ్చాడు..పనికొస్తే తీసుకో” అని చెప్తే అప్పుడు రవి “ఇప్పటికే చాలా మందిని చూసాం..సినిమా వాళ్ళని కూడా కొంతమందిని చూసాం కానీ ఒక్కడు సెట్ అవ్వడం లేదు.. నువ్వు నా మైండ్ లో ఉన్నావ్ కానీ నీ address తెలీదు..నీ ఫోన్ నెంబర్ తెలియదు.. నువ్వు వెళ్ళిఆడిషన్ ఇచ్చి రా” అన్నాడు.

నా గుండెలో రాయి పడింది..నిజానికి నాకు యాంకరింగ్ చెయ్యాలని లేదు..అప్పటికే జై సినిమా చేసి ఉన్నా..సినిమాల్లో చేద్దామని ఉంది తప్ప టీవీలో రావాలని లేదు..పైగా ఫ్రెండ్ నీ రికమెండ్ చేద్దామని వస్తే నన్ను పట్టుకున్నాడు..సరే మొహమాటం తో వెళ్లి ఆడిషన్ ఇచ్చా..నాకు తెలుసు నేను సెలక్ట్ అవుతానని..మొహమాటం తో వెళ్ళినా రంగంలోకి దిగాక విజృంభిస్తగా.

TV9 founder V Ravi Prakash vows to fight builders, contractors' lobby in journalism - india news - Hindustan Times

అప్పటి నా ఆడిషన్ చేసిన వాళ్ళు ఒకరు ఇప్పుడు trs ఎమ్మెల్యే “క్రాంతి” గారు..మరొకరు “సినిమా రంగంలో నిర్మాతగా ఉన్న “సునీత తాటి గారు”.

మొత్తానికి అనుకున్న దంతా అయింది..నేను సెలక్ట్ అయ్యాను. అప్పుడు నేను రవి తో “నేను జాబ్ చేస్తున్నాను నీకు తెలుసు కదా , సినిమాలంటే అప్పుడప్పుడు వస్తాయి..చేసుకోవచ్చు కానీ యాంకరింగ్ అంటే రోజు రావాలి మరి ఎలా అంటే ,

మరేం పర్లేదు నైట్ షూట్ ఉంటుంది..నీ ఆఫీస్ వర్క్ కి ఏమి డిస్టర్బ్ కాదు..గెస్ట్ లా వచ్చి వేళ్ళు అని ఒప్పిచ్చాడు.

నాకు తెలిసినంత వరకు నేను చెప్పిన మొదటి క్రైమ్ స్టోరీ పరిటాల రవి నీ హత్య చేసిన మొద్దు శ్రీను గురించి అనుకుంటా.

అలా రవిప్రకాష్ వల్ల నా క్రైమ్ యాంకరింగ్ మొదలైంది. అలాగే కొన్ని వందల వాయిస్ ఓవర్ లు చెప్పా.. కొన్ని స్టోరీలు.. ప్రోమోల కి వాయిస్ నాతో చెప్పించేవాడు.

క్రైం యాంకర్‌గా న్యూస్ ఛానెల్ చరిత్రలో జరిగిన పెను సంచలనం మీకందరికీ తెలిసిందే.

ఆలాగే రవిప్రకాష్ టివి9 న్యూస్ ఛానెల్ మొదలుపెట్టి..నవ శకానికి తెర లేపి..ఎంతటి ప్రకంపనలు సృష్టించాడు అందరికీ తెలుసు.

ప్రభుత్వానికి సమాంతరంగా టివి9 నడిచింది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. దానికి కారణం రవిప్రకాష్.. the media తైకున్.

Electronic media lo Oka విప్లవాన్ని తీసుకొచ్చి..ఎందరికో మార్గదర్శి గా నిలిచాడు.. ఎవరికి అందనంత ఎత్తుకి ఎదిగాడు.

ఒకప్పుడు టివి9 పేరు విన్నా.. రవిప్రకాష్ పేరు విన్నా..అలాగే నా పేరు విన్నా..చూసినా.. కొంత మందికి గజ.. గజ..గజ.. పచ్చిగా చెప్పాలంటే … ఉచ్చ

నాణానికి మరోవైపు…..

టివి9 అంటే ఎంతగా ఇష్ట పడ్డవారు ఉన్నారో అంతే మంది వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు. అలాగే రవిప్రకాష్ విషయంలో కూడా.

ఎన్నో ఆరోపణలు ఉన్నాయి..ఆ విషయాల గురించి నేను మాట్లాడ తలుచుకొలేదు. ఎందుకంటే నాకు తెలియదు కనుక..వాటికి కాలేమే సమాధానం చెప్పాలి.

Read Also