Rakesh Master : రాకేష్ మాస్టర్.. ఏంటి ఆ పిచ్చివాగుడు!

Rakesh Master : రామారావు ఈ పేరు అంటే పెద్దగా ఎవరికి తెలియకపోవచ్చు .. ఎవరు గుర్తుపట్టారు కూడా … కానీ రాకేష్ మాస్టర్ అంటే అందరూ టక్కున గుర్తుపడుతారు.. ఇప్పుడు యూట్యూబ్ లో రాకేష్ మాస్టర్ ఓ సంచలనం… ఎక్కడ చూసిన ఈయన వీడియోలే కనిపిస్తాయి.. ఏదైనా ఛానల్ కి ఆయన ఇంటర్వ్యూ ఇస్తే ఆ ఛానల్ పాపులర్ అవుతుంది..

అయితే ఇలాంటి ఇంటర్వ్యూలు ఇవ్వకముందు అసలు రాకేష్ మాస్టర్ పెద్దగా ఎవరికి తెలియదు.. ఇంతకీ రాకేష్ మాస్టర్ ఎవరు ఎక్కడి నుంచి వచ్చాడు. ఎందుకు నిత్యం వార్తల్లో నిలుస్తున్నాడన్న ఆసక్తి అందరిలో నెలకొంది.. 1968 వ సంవత్సరంలో తిరుపతిలో జన్మించాడు రాకేష్.. మొత్తం రాకేష్ మాస్టర్ కి నలుగురు అక్కలు ఒక అన్న ఓ తమ్ముడు ఉన్నాడు.

చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే వీపరితమైన ఇంట్రెస్ట్ ఉన్న రాకేష్ మాస్టర్ ముక్కురాజు మాస్టర్ దగ్గర శిక్షణ తీసుకున్నారు.. ఆ తరవాత తానే ఓ ఇనిస్టిట్యూట్ పెట్టాడు.. రాకేష్ మాస్టర్ దగ్గర హీరో వేణు, ప్రభాస్ , ప్రత్యుశ మొదలగువారు డాన్స్ నేర్చుకున్నారు. ఇక ఇందులో వేణు తాను నటించిన చిరునవ్వుతో సినిమాలో ‘నిన్నలా మొన్నలా లేదురా’ అనే పాటకి కొరియోగ్రఫర్ గా ఛాన్స్ ఇచ్చారు.. ఇదే రాకేష్ మాస్టర్ కి మొదటి సినిమా, మొదటి పాట కూడా..

ఇక అక్కడి నుంచి మళ్లీ రాకేష్ మాస్టర్ వెనుదిరిగి చూసుకుంది లేదు. అందరితో కలిసి పనిచేశాడు.. అయితే కొందరు దర్శకులు రాకేష్ మాస్టర్ పైన తన అహంకారాన్ని చూపించారు.. అసలే ముక్కుసూటితనం ఉన్న రాకేష్ మాస్టర్ వాళ్ళతో వాగ్వాదానికి వెళ్ళాడు.. ఎలాగోలా ఆ సినిమాలను కంప్లీట్ చేసాడు. మళ్లీ వాళ్ళతో సినిమాలు చేయాలని అనుకోలేదు.. అలాంటి దర్శకులతో అర్జీవీ, కృష్ణవంశీ లాంటి దర్శకులు ఉన్నారు..

  • డోస్ పెంచిన సమంత.. ఈ కొత్త లుక్స్ ఎందుకో..?

ఇక డాన్స్ యూనియన్ కార్డులో ఆడిషన్స్ పెట్టకుండా లంచాలు తీసుకొని కార్డులు ఇస్తున్నారని తెలిసి ఎదురుతిరిగాడు.. ఇలా అయితే మన ఆటలు సాగవని కొందరు రాకేష్ మాస్టర్ ని టార్గెట్ చేసి అవమానించడం మొదలు పెట్టారు..అందులో కొందరు రాకేష్ మాస్టర్ శిష్యులు కూడా ఉన్నారు.. దీనితో రాకేష్ మాస్టర్ కార్డును కూడా తొలిగించారు.. ఇక చేసేది లేకా తానే ఓ యూనియన్ ని పెట్టాడు.. అందులో అతని అభిమానులు చాలా మంది చేరారు..

ఇక టాలీవుడ్ హీరోలందరి పైన విమర్శలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలిచారు రాకేష్ మాస్టర్.. ముందుగా ఎన్టీఆర్ తో తన విమర్శలను మొదలు పెట్టి సంచలనం సృష్టించారు. ఇదే ఆయన చేసిన మొదటి తప్పు .. విమర్శించడం తప్పు కాదు.. విమర్శించే విధానం తప్పు.. విమర్శించడంలో రాకేష్ మాస్టర్ హద్దులు దాటారు.. ఒరేయ్, వెధవ, జఫ్ఫా అంటూ నోటికి ఎంతోస్తే అంత మాటలు అనేశారు.. హీరోలతో పాటు అభిమానులను తిట్టడం రాకేష్ మాస్టర్ కి మైనస్ గా మారింది. దీనితో ఆయన వీడియోలు కామెడీ అయిపోయాయి.. ట్రెండ్ అయిపోయాయి.. ఇవి చూసిన నెటిజన్లు.. ఆ వీడియోల కింద ఏంటి ఆ పిచ్చి వాగుడు అంటూ తిడుతున్నారు.. ముక్కుసూటితనంతో, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే ఎవరికి నచ్చదు కాబట్టి రాకేష్ మాస్టర్ అందరికి ఓ శత్రువు అయిపోయాడు..

ఇక రాకేష్ మాస్టర్ సంపాదించిన దాంట్లో సగం కుటుంబానికి సగం సమాజానికి ఖర్చు పెడుతున్నాడు కానీ ఏనాడు కూడా పబ్లిసిటీ చేసుకోడు.. ఇక 1996 లో రాకేష్ మాస్టర్ ఓ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు.. తన మీద ఉన్న అభిమానంతో ఆమె రాకేష్ మాస్టర్ కి భోజనం తెచ్చెదట.. ఆ తరవాత ఆమెను పెళ్లి చేసుకున్నారు రాకేష్ మాస్టర్.. ఇక వారిద్దరి మధ్య విభేదాలు రావడంతో విడిపోయారు.. ఆ తర్వాత మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు రాకేష్ మాస్టర్.. ఇప్పుడు వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు..