తిరుమలలో 140 మందికి కరోనా పాజిటివ్

X
Highlights
తిరుమల శ్రీవారి ఆలయంలో కరోనా టెన్షన్ కొనసాగుతోంది. ఆలయంలో పనిచేసే సిబ్బంది కరోనా భారిన పడుతూనే ఉన్నారు. ఇప్పటి ...
Batukamma16 July 2020 4:33 PM GMT
తిరుమల శ్రీవారి ఆలయంలో కరోనా టెన్షన్ కొనసాగుతోంది. ఆలయంలో పనిచేసే సిబ్బంది కరోనా భారిన పడుతూనే ఉన్నారు. ఇప్పటి వరకు 140 మంది కరోనా బారిన పడ్డారని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఇందులో 70 మంది వరకు కోలుకున్నారని ఆయన చెప్పారు.
తిరుమల ఆలయంలో పరిస్థితిపై అధికారులతో చర్చించారు సుబ్బారెడ్డి. కరోనా వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కరోనా సోకిన సిబ్బందికి మంచి వైద్యం అందిస్తున్నామన్నారు.
ఇక.. ఆలయంలో దర్శనాల కంటే కూడా.. స్వామివారికి పూజాకార్యక్రమాలే ముఖ్యమన్నారు. దీనిపై అర్చకులతో మాట్లాడామన్నారు. అర్చకులు ఆలయంలోనే ఉండేలా వారికి వసతి ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో శ్రీవారి ఆలయంలో దర్శనాలు పెంచే ఆలోచన లేదన్నారు.
Next Story