Top
Batukamma

Fake Universities : దేశంలో 24 ఫేక్ యూనివర్సిటీలు.. అవి ఇవే

Fake Universities : దేశంలో 24 ఫేక్ యూనివర్సిటీలు.. అవి ఇవే
X
Highlights

దేశంలో ఉన్న యూనివర్సిటీల గురించి సంచలన విషయాలు బయటపెట్టింది యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్. దేశంలో చాలా ఫేక్ యూనివర్సిటీలున్నాయని చెప్పింది.

24 fake universities in india 2020 : దేశంలో ఉన్న యూనివర్సిటీల గురించి సంచలన విషయాలు బయటపెట్టింది యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్. దేశంలో చాలా ఫేక్ యూనివర్సిటీలున్నాయని(Fake Universities) చెప్పింది. దేశవ్యాప్తంగా 24 ఫేక్ యూనివర్సిటీలున్నాయని తెలిపింది. ఇందులో చదివినా... ఆ డిగ్రీకి విలువ ఉండదని.. ఎక్కడా దాన్ని యాక్సెప్ట్ చేయబోరని చెప్పింది.

ఫేక్ యూనివర్సిటీల్లో ఎక్కువగా ఉత్తరప్రదేశ్ లోనే ఉండటం విశేషం. ఆ తర్వాతి స్థానంలో దేశరాజధాని ఢిల్లీ ఉంది. యూపీలో 8 ఫేక్ యూనివర్సిటీలుంటే.. ఢిల్లీలో 7 ఫేక్ యూనివర్సిటీలున్నాయి. ఇవన్నీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నాయని తెలిపింది.

ఉత్తరప్రదేశ్ లోని వారనాసేయ సంస్కృత విద్యాలయ(Varanaseya Sanskrit Vishwavidyalaya), మహిళా గ్రామ్ విద్యాపీఠ్(Mahila Gram Vidyapith,), గాంధీ హిందీ విద్యాపీఠ్(Gandhi Hindi Vidyapith), నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ ఎలక్ట్రో కాంప్లెక్స్ హోమియోపతి(National University of Electro Complex Homeopathy,), నేతాజి సుభాష్ చంద్రబోస్ ఓపెన్ యూనివర్సిటీ(Netaji Subhash Chandra Bose Open University), ఉత్తరప్రదేశ్ విశ్వవిద్యాలయ(Pradesh Vishwavidyalaya), మహారాణాప్రతాస్ శిక్ష నికేతన్ విశ్వవిద్యాలయ(Maharana Pratap Shiksha Niketan Vishwavidyalaya), ఇంద్రప్రస్థ శిక్షా పరిషద్ (Indraprastha Shiksha Parishad) ఫేక్ యూనివర్సిటీలని ప్రకటించింది.

ఢిల్లీలో కమర్షియల్ యూనివర్సిటీ లిమిటెడ్(Commercial University Ltd), యునైటెడ్ నేషన్స్ యూనివర్సిటీ(United Nations University), ఒకేషనల్ యూనివర్సిటీ(Vocational University), ఏడీఆర్ సెంట్రిక్ జురిడిషియల్ యూనివర్సిటీ(, ADR Centric Juridicial University), ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్(Indian Institution of Science and Engineering, విశ్వకర్మ ఓపెన్ యూనివర్సిటీ ఫర్ సెల్ఫ్ ఎంప్లాయ్ మెంట్ అండ్ ఆద్మాత్మిక్(Vishwakarma Open University for Self Employment and Adhyatmik Vishwavidyalaya) విశ్వవిద్యాలయాలకు యూజీసీ అనుమతి లేదని ప్రకటించింది.

వీటితో పాటు.. ఒడిశా, వెస్ట్ బెంగాల్ లో రెండేసి యూనివర్సిటీలు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, పుదుచ్చేరిలో ఒక్కో యూనివర్సిటీకి అనుమతులు లేవని అనౌన్స్ చేసింది. వీటిల్లో చేరితే విద్యార్థులు భవిష్యత్ ఆగం కావడం ఖాయం అంటోంది యూజీసీ. అందుకే త్వరగా సర్టిఫికేట్ ఇస్తారని.. ఏదో ఒక యూనివర్సిటీలో చేరడం మంచిది కాదని హెచ్చరిస్తోంది యూజీసీ.

Read Also :

Next Story
Share it