Pawan Kalyan : పవన్ బర్త్ డే ఫ్లెక్సీలు కడుతూ ముగ్గురి మృతి

దూరమైన బిడ్డలను తిరిగి తీసుకురాలేను కనుక ఆ తల్లితండ్రులకు నేనే ఒక బిడ్డగా నిలుస్తాను. ఆర్థికంగా ఆ కుటుంబాలను ఆదుకొంటాను.
3 died on pawan kalyan birth day celebrations : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బర్త్ డే వేడుకల సందర్భంగా చిత్తూరుజిల్లాలో విషాధం చోటుచేసుకుంది. చిత్తూరు జిల్లా శాంతిపురంలో పవన్ కల్యాణ్ బర్త్ డే ఫ్లెక్సీలు కడుతుండగా కరెంట్ షాక్ తగిలింది. ఈ ప్రమాదంలో ముగ్గురు చనిపోయారు. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరికి పీఈఎస్ మెడికల్ కాలేజీకి తరలించి ట్రీట్మెంట్ చేస్తున్నారు.
ఈ ప్రమాదంపై పవన్ కల్యాణ్(pawan kalyan )దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.
“గుండెల నిండా నా పట్ల అభిమానం నింపుకొన్న కుప్పం నియోజకవర్గ జనసైనికులు శ్రీ సోమశేఖర్, శ్రీ రాజేంద్ర, శ్రీ అరుణాచలం విద్యుత్ షాక్ తో దుర్మరణం పాలవడం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. శాంతిపురం దగ్గర కటౌట్ కడుతూనే విద్యుత్ షాక్ తగలడంతో వారు చనిపోయారనే వార్త నా మనసుని కలచివేసింది. ఇది మాటలకు అందని విషాదం. ఆ తల్లితండ్రుల గర్భ శోకాన్ని అర్థం చేసుకోగలను.”
- Amazon : ఆర్డర్ చేస్తే 30 నిమిషాల్లోనే డెలివరీ.. అమెజాన్ అదుర్స్
- ప్రణబ్ ముఖర్జీ లేకుంటే సోనియా గాంధీ లేదు!
- ప్రణబ్ జీవితంలోని ఆసక్తికర విశేషాలు
“దూరమైన బిడ్డలను తిరిగి తీసుకురాలేను కనుక ఆ తల్లితండ్రులకు నేనే ఒక బిడ్డగా నిలుస్తాను. ఆర్థికంగా ఆ కుటుంబాలను ఆదుకొంటాను. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను.”
“మరో ముగ్గురు జన సైనికులు శ్రీ హరికృష్ణ, శ్రీ పవన్, శ్రీ సుబ్రహ్మణ్యం చికిత్స పొందుతున్నారు అనే సమాచారం ఉంది. వారు త్వరగా కోలుకోవాలని దైవాన్ని ప్రార్థిస్తున్నాను. బాధిత కుటుంబాలకు అవసరమైన తక్షణ సహాయం అందించాలని చిత్తూరు జిల్లా జనసేన నాయకులకు సూచించానని.. ఓ ప్రకటన విడుదల చేశారు.
ఇవి కూడా చదవండి :
- Sri Venkateswara Creations AnanyaNagalla BoneyKapoor SriramVenu Thaman S PSPK26 VakeelSaab PSPK26 VakeelSaab HBDPawanKalyan VakeelSaabMotionPoster PawanKalyan Nivetha Thomas 3 died on pawan kalyan birth day celebrations Anjali batukamma Batukamma.com Bayviewprojects pawan kalyan birthday Power Star