Top
Batukamma

3000 Covid Patients In Bengaluru Untraceable : కరోనా పేషెంట్లు కనిపించట్లేదు

3000 Covid Patients In Bengaluru Untraceable : కరోనా పేషెంట్లు కనిపించట్లేదు
X
Highlights

దేశమంతా ఇప్పుడు కరోనా భయంతో నిండిపోయి ఉంది. ఎక్కడ పాజిటివ్ కేసులు వచ్చినా జనం వణికిపోతున్నారు. ఇక.. తమ ఏరియాలో ...

దేశమంతా ఇప్పుడు కరోనా భయంతో నిండిపోయి ఉంది. ఎక్కడ పాజిటివ్ కేసులు వచ్చినా జనం వణికిపోతున్నారు. ఇక.. తమ ఏరియాలో కేసులు వచ్చాయంటే సరిగ్గా నిద్ర కూడా పోవడం లేదు ప్రజలు.

అందుకే కరోనా వచ్చిన వారిని హాస్పిటల్ కు తరలించి ఐసోలేషన్ లో పెడుతున్నారు. తక్కువ లక్షణాలుంటే ఇంట్లోనే ఐసోలేట్ కావాలని చెబుతున్నారు.

అయితే.. బెంగళూరులో మాత్రం ఓ దారుణమైన ఘటనన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కరోనా సోకిన 3338 పేషెంట్లు కనిపించకుండా పోయారట. ఒక్కరు కాదు ఇద్దరు కాదు. ఇంత పెద్ద మొత్తంలో పేషెంట్లు గల్లంతుకావడంతో బెంగళూరు జనం వణికిపోతున్నారు.

చాలామంది ప్రైవేటు ల్యాబులకు వెళ్లి టెస్టులు చేయించుకున్నారు. శాంపిల్ ఇచ్చి వెళ్లిపోయారు.అయితే.. వారు అడ్రస్ మాత్రం సరైంది ఇవ్వలేదని అధికారులు గుర్తించారు. వారు ఎవరనేది సీసీ కెమెరాల ద్వారా గుర్తించి ట్రేస్ ఔట్ చేసే పనిలో ఉన్నారు.

కర్ణాటకలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. శనివారం వరకే కేసుల సంఖ్య 90 వేల 900 దాటింది. 55 వేల మందికి పైగా హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్ పొందుతున్నారు.

Next Story
Share it