Top
Batukamma

భర్త పైన కేసు పెట్టిన భార్య .. ఓ పాట పాడి పోలిస్ స్టేషన్ లో కూల్ చేసిన భర్త!

భర్త పైన కేసు పెట్టిన భార్య .. ఓ పాట పాడి పోలిస్ స్టేషన్ లో కూల్ చేసిన భర్త!
X
Highlights

ఓ భార్య తన భర్తపై కేసు పెట్టింది. సో వాట్.. ఇందులో వింత ఏముంది అనుకోవచ్చు ... కానీ ఆ కేసు ముగియడం అనేది ఇక్కడ...

ఓ భార్య తన భర్తపై కేసు పెట్టింది. సో వాట్.. ఇందులో వింత ఏముంది అనుకోవచ్చు ... కానీ ఆ కేసు ముగియడం అనేది ఇక్కడ స్పెషల్.. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్ లోని ఝాన్సీ అనే ప్రాంతానికి చెందిన ఓ ఇద్దరు భార్యాభర్తలు కొన్నిరోజుల క్రితం గొడవపడ్డారు. ఇంకా తగ్గేది లేదని ఆ భార్య భర్త పైన కేసు పెట్టి పుట్టింటికి వెళ్ళింది.

అక్కడ పెద్ద మనుషుల దగ్గర పంచాయితీ పెట్టారు. కానీ అక్కడ కూడా వారి పంచాయితీ ముగియలేదు. ఇక అక్కడినుంచి పోలిస్ స్టేషన్ కి వెళ్ళింది. అక్కడ తనకి తన భార్య కావాలని భర్త, భర్త వద్దంటూ భార్య చెప్పుకొచ్చారు. ఇదెక్కడి గోలరా బాబు అని పోలీసులు తలలు పట్టుకున్నారు. ఇకా ఇది ఇలా కాదు అని తన భార్య కోపాన్ని తానే తగ్గిస్తానని రంగంలోకి దిగాడు ఆ భర్త..

అందుకోసం ఎం చేశాడంటే ఓ పాట పాడాడు. పాటా.. అవును పాటే.. బద్లాపూర్ చిత్రం నుండి ఆత్మీయమైన పాట పాడాడు. ఆ పాటకి వెంటనే ఆ భార్య మనసు కరిగిపోయింది. అంతేకాకుండా ఆ భర్త కౌగిల్లో వాలిపోయింది. దీనితో అక్కడ ఉన్న పోలీసులు, బంధువులు అందరూ చప్పట్లు కొట్టారు.

వాస్తవానికి ఇది 2017 లోని వార్త, కానీ ఇప్పుడు ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో పైన మీరు కూడా ఓ లుక్కేయండి!

https://twitter.com/IPSMadhurVerma/status/930336781077176320?ref_src=twsrc^tfw|twcamp^tweetembed|twterm^930336781077176320|twgr^&ref_url=https://indianexpress.com/article/trending/viral-videos-trending/video-man-serenades-to-wife-who-had-filed-a-case-against-him-at-jhansi-police-station-and-gets-a-surprising-response-4940119/

Next Story
Share it