Top
Batukamma

మన వరంగల్ పిల్ల.. తమిళ్ లో బిజీ హీరోయిన్!

మన వరంగల్ పిల్ల.. తమిళ్ లో బిజీ హీరోయిన్!
X
Highlights

ఇప్పుడు తెలుగు హీరోయిన్స్ మన టాలీవుడ్ లో కంటే ఎక్కువగా తమిళ్ ఇండస్ట్రీలోనే రాణిస్తున్నారు.. యాంకర్ గా కెరీర్...

ఇప్పుడు తెలుగు హీరోయిన్స్ మన టాలీవుడ్ లో కంటే ఎక్కువగా తమిళ్ ఇండస్ట్రీలోనే రాణిస్తున్నారు.. యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన స్వాతి ఆ తర్వాత హీరోయిన్ గా మారి పలు సినిమాల్లో చేసింది కానీ అనుకున్నంతగా గుర్తింపు రాలేదు.. దీనితో తమిళ్ లో అవకాశాలు కోసం ట్రై చేయగా అక్కడ సూపర్ క్లిక్ అయింది.. చాలా అవకాశాలు వచ్చాయి..

ఇక ఆనంది మన తెలుగు అమ్మాయి... ఇంకా పక్కాగా చెప్పాలంటే తెలంగాణ పిల్ల.. వరంగల్ లో పుట్టింది. మారుతి దర్శకత్వంలో వచ్చిన ఈ రోజుల్లో అనే సినిమాల్లో ఓ పాటలో కనిపించింది. ఇక బస్ స్టాప్ సినిమాలో సీమ అనే పాత్రలో కనిపించి ఆకట్టుకుంది.. కానీ ఆమెకి అవకాశాలు అంతంత మాత్రంగానే వచ్చాయి.. వరుణ్ సందేశ్ హీరోగా వచ్చిన ప్రియతమా నీవచట కుశలమా అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది..

ఆ తర్వాత తమిళ్ ఇండస్ట్రీలోకి చెక్కేసిన ఆ అమ్మడు మంచి అవకాశాలను దక్కించుకొని అక్కడ బిజీ హీరోయిన్ గా మారిపోయింది.. అక్కడ ఆమె చేసిన సినిమాలకి బాగా క్రేజ్ వచ్చింది. అంతేకాకుండా ఆమె నటనకి గాను అవార్డులు లభించాయి.. ఇప్పటికి ఆమె చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి. ఇలాంటి టాలెంటెడ్ ఆర్టిస్ట్ ని మన ఇండస్ట్రీ గుర్తించకపోవడం దారుణం..

Image

ఇవి కూడా చదవండి!

Image

Image

Image

Next Story
Share it