Actress Pragathi On Casting Couch : అమ్మాయిల కోసమే సినిమాలు తీస్తున్నారు..!

Actress Pragathi On Casting Couch : ఫిల్మ్ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ గురించి చాలాకాలంగా ఆరోపణలు వస్తూనే...
Actress Pragathi On Casting Couch : ఫిల్మ్ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ గురించి చాలాకాలంగా ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. ఇండస్ట్రీలోని చాలామంది లేడీస్.. ఈ విషయం గురించి బయటకు చెప్పారు. శ్రీరెడ్డి అయితే ఓ భారీ పోరాటమే చేసింది. మాధవీలత, గాయత్రిగుప్తా లాంటి వాళ్లు చాలా సార్లు మాట్లాడారు.
అయినా.. ఇండస్ట్రీ పెద్దలు మాత్రం సినీ పరిశ్రమలో అలాంటి పరిస్థితులు లేవు.. అంతా బాగానే ఉంది. ఒక కుటుంబంలా కలిసి పని చేసుకుంటున్నామని చెబుతుంటారు. కానీ.. మరో నటి.. ఇండస్ట్రీలో చాలాకాలంగా ఉన్న నటి.. క్యాస్టింగ్ కౌచ్ గురించిన వాస్తవాలు బయటపెట్టింది.
చాలా సినిమాల్లో తల్లి, అక్క.. క్యారెక్టర్లలో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకుంది ప్రగతి. సినిమాల్లో ఎంత పద్ధతిగా కనిపిస్తుందో.. సోషల్ మీడియాలో మాత్రం దానికి పూర్తిగా అపోజిట్ గా ఉంటుంది. ఫుల్ హాట్ ఫొటోలు, వీడియోలు, వర్కౌట్స్ తో కొద్ది రోజులుగా సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో క్యాస్టింగ్ కౌచ్ గురించి బయటపెట్టింది.
- అందాలతో మతిపోగోడుతున్న ఇస్మార్ట్ బ్యూటి!
- గృహలక్ష్మి ఫేం ‘కస్తూరి’ మాములుగా రెచ్చిపోలేదుగా!
- అందంతో పిచ్చెక్కిస్తున్న గుంటూరు టాకీస్ పోరి!
- అనసూయ అందాల కనువిందు
ప్రస్తుతం ఇండస్ట్రీ చాలా ఘోరంగా తయారైందని చెప్పకనే చెప్పింది ప్రగతి. కేవలం అమ్మాయిల కోసమే సినిమా తీసే పరిస్థితులు వచ్చాయంటోంది. అమ్మాయి అందంగా కనిపిస్తే చాలు.. డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు అప్రోచ్ అవుతున్నారని అంటోంది. యాక్టింగ్ పూర్తిగా వచ్చినా రాకుండా వారితో సినిమాలు తీస్తున్నారని చెప్పింది.
అయితే.. క్యాస్టింగ్ కౌచ్ పరిస్థితులు ఎదురైనప్పుడు.. ఎలా ఉండాలనేది అమ్మాయిలను బట్టే ఉంటుందని అంటోంది ప్రగతి. వాళ్లు ధైర్యంగా ఉంటే ఈ పరిస్థితులను ఎదుర్కోవచ్చని చెబుతోంది. తనకు అలాంటి పరిస్థితులు ఎదురయ్యాయని చెప్పింది. కానీ.. అలాంటి అవకాశాలు వద్దనుకుని.. సినిమాలు వదిలేసుకున్నానని అంటోంది ప్రగతి.
ప్రగతి మరో కాంట్రవర్సియల్ విషయాన్ని బయటకు తీసుకొచ్చింది. పెద్ద హీరోయిన్లు, ఇండస్ట్రీలో ఓ స్థాయికి వెళ్లిన నటీమణులు.. క్యాస్టింగ్ కౌచ్ లేదనే చెబుతారని.. కానీ సక్సెస్ కానీ వారు.. అవకాశాలు రాక ఇబ్బందులు పడ్డవారు మాత్రం క్యాస్టింగ్ గురించి బయటకు చెబుతుంటారని.. మరో కాంట్రవర్సీకి తెరతీసింది.
...
https://youtu.be/VZoSNlRF3V4