Top
Batukamma

Actress Saipallavi : ఎగ్జామ్ సెంటర్ లో సాయిపల్లవి. షాకైన స్టూడెంట్స్

Actress Saipallavi : ఎగ్జామ్ సెంటర్ లో సాయిపల్లవి. షాకైన స్టూడెంట్స్
X
Highlights

ఇప్పుడు సాయి పల్లవికి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ చక్కర్లు కొడుతోంది. కరోనా లాక్ డౌన్ లో అందరూ ఇళ్లలో సినిమాలు, వెబ్ సిరీస్ లు చూస్తూ టైం పాస్ చేస్తే.

Actress Saipallavi Attended FMGE Exam : సాయి పల్లవి. సౌతిండియా సినీ పరిశ్రమలో పరిచయం అక్కర్లేని పేరు. తన డ్యాన్స్ తో, నేచురల్ యాక్టింగ్ లో కోట్లాది మంది ప్రేక్షకులను సంపాదించుకుంది ఈ భామ. ప్రేమమ్ అనే మలయాళ సినిమా ద్వారా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సాయి పల్లవి అతి తక్కువ కాలంలోనే ప్రేక్షకులకు దగ్గరైంది.

ఇప్పుడు తెలుగులో టాప్ హీరోయిన్ అయిపోయింది. ప్రతీ సినిమాలోనూ తనదైన మార్క్ తో ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తోంది. తమిళంలో కొన్ని సినిమాలు చేసినా పెద్దగా పేరు రాలేదు.

అయితే.. ఇప్పుడు సాయి పల్లవికి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ చక్కర్లు కొడుతోంది. కరోనా లాక్ డౌన్ లో అందరూ ఇళ్లలో సినిమాలు, వెబ్ సిరీస్ లు చూస్తూ టైం పాస్ చేస్తే.. హీరోయిన్ సాయిపల్లవి మాత్రం ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అయ్యింది. ఈ మంగళవారం నాడు ఎగ్జామ్ కి కూడా అటెండ్ అయ్యింది. తిరుచ్చి లోని MAM కాలేజీలో ఎగ్జామ్ రాసింది.

[embed]https://www.instagram.com/p/CEqeuaAjVfy/?igshid=1f6wc3110s7md[/embed]

యాక్టర్ అయ్యే కంటే ముందే సాయిపల్లవి డాక్టర్. ఫారెన్ లో వైద్యవిద్య పూర్తిచేసింది. ఇప్పుడు దేశంలో ప్రాక్టీస్ చేయాలంటే ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. దీనికోసం నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ నిర్వహించే ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ కు సాయిపల్లవి అటెండ్ అయ్యింది.

ఇండియన్ మెడికల్ కౌన్సిల్, స్టేట్ మెడికల్ కౌన్సిల్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఈ పరీక్ష కచ్చితంగా పాసవ్వాల్సి ఉంటుంది. అందుకే లాక్ డౌన్ లో ఫుల్ గా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాసింది.

Image

అయితే.. ఎగ్జామ్ సెంటర్ లో సాయిపల్లవిని చూసినవారంతా షాక్ అయ్యారు. ఆమెతో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. ఆమె వారిని దూరం పెట్టకుండా.. వారితో మాట్లాడి ఫొటోలకు ఫొజులిచ్చింది.

ఇవి కూడా చదవండి :

Next Story
Share it