జగనన్న అభిమానులు క్షమించండి.. ఇంకెప్పుడు ఇలా చేయను!

Comedian Riyaz Apologize : ఇటీవల జీ తెలుగులో బొమ్మ అదిరింది అనే కామెడీ షో మొదలైంది.. అక్టోబర్ 4న ప్రసారమైన ఈ...
Comedian Riyaz Apologize : ఇటీవల జీ తెలుగులో బొమ్మ అదిరింది అనే కామెడీ షో మొదలైంది.. అక్టోబర్ 4న ప్రసారమైన ఈ షో కి శ్రీముఖి యాంకర్ గా వ్యవహరించింది.. సుమ చీఫ్ గెస్ట్ గా హాజరైంది.. డాన్స్ మాస్టర్ జానీ, నాగబాబు జడ్జిలుగా వ్యవహరించారు...
అయితే ఫస్ట్ ఎపిసోడే పెద్ద వివాదాస్పదమైంది.ఈ షోలో గల్లీ బోయ్స్, రౌడీ బోయ్స్ కలిసి ఒక స్కిట్ చేశారు. ఈ స్కిట్ లో ప్రముఖ సినీ రాజకీయ ప్రముఖులను ఇమిటేట్ చేశారు.
అయితే సద్దాం టీమ్‌లో ఉండే రియాజ్ ఏపీ సీఎం జగన్ ను ఇమిటేట్ చేశాడు. అయితే ఇది నచ్చని జగన్ అభిమానులు షో పైన, షో నిర్వాహకుల పైన, శ్రీముఖి, నాగబాబు, జానీ మాస్టర్ లపైన ఫైర్ అయ్యారు. రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్లుగా పోస్టర్స్ క్రియేట్ చేసి సోషల్ మీడియా లో వదిలి రచ్చరచ్చ చేశారు.
అంతేకాకుండా జగన్ అభిమానులకు బహిరంగంగా రియాజ్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో జగన్ అభిమానులకు రియాజ్ క్షమాపణలు చెప్పాడు
అందరికీ నమస్కారం నేను మీ అదిరింది రియాజ్... గత వారం ఎపిసోడ్లో జగన్ అన్నని ఇమిటేట్ చేస్తూ ఓ స్కిట్ చేశాను..ఇది చూసి కొంత మంది వైఎస్సార్సీపీ నాయకులు మెచ్చుకున్నారు. కానీ, కొంత మంది జగనన్న అభిమానులు హర్ట్ అయ్యారని తెలిసింది. అలా హార్ట్ అయిన జగనన్న అభిమానులందరికీ నా తరపున అదిరింది షో తరఫున క్షమాపణలు చెబుతున్నాను .. ఇంకెప్పుడూ ఇలా జరగకుండా చూసుకుంటాను" అని రియాజ్ వెల్లడించాడు.
https://www.youtube.com/watch?v=9jskGQKVeUA
అయినప్పటికీ జగన్ ఫ్యాన్స్ ఆగ్రహం తగ్గడం లేదు.. కచ్చితంగా అదే ప్రోగ్రాంలో సీఎం జగన్మోహన్ రెడ్డికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.