Amazon : ఆర్డర్ చేస్తే 30 నిమిషాల్లోనే డెలివరీ.. అమెజాన్ అదుర్స్

Amazon drone delivery : లాక్ డౌన్ లో ఈ కామర్స్ సంస్థల కార్యకలాపాలు భారీగా పెరిగిపోయాయి. ప్రజలు ఇళ్లలోంచి బయటకు ...
Amazon drone delivery : లాక్ డౌన్ లో ఈ కామర్స్ సంస్థల కార్యకలాపాలు భారీగా పెరిగిపోయాయి. ప్రజలు ఇళ్లలోంచి బయటకు రాకపోవడంతో ఈ కామర్స్ సంస్థల పంట పండింది. దీంతో ప్రజలకు లెటెస్ట్ ఆఫర్లు, సదుపాయాలతో వల వేస్తున్నాయి ఈ కామర్స్ సంస్థలు.
ఇందులో అమెజాన్ కాస్త దూకుడుగా వెళ్తోంది. ఇప్పటికే ప్రైమ్ కస్టమర్లకు సింగిల్ డే లో ఐటమ్స్ డెలివరీ ఇస్తోంది. ఇప్పుడు ఆ స్పీడ్ ను మరింత పెంచాలని చూస్తోంది. ప్రొడక్ట్ ను ఆర్డర్ చేసిన అరగంటలోపే హోం డెలివరీ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
ఈ ఫాస్టెస్ట్ డెలివరీ కోసం డ్రోన్లు వాడాలని నిర్ణయించింది అమెజాన్. అయితే.. ఇది మన దేశంలో మాత్రం కాదు. కేవలం అమెరికాలో మాత్రమే. దీనికి అమెరికా ప్రభుత్వం కూడా అనుమతి ఇచ్చింది. డ్రోన్ల ద్వారా డెలివరీకి యూఎస్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ పర్మీషన్ ఇచ్చింది.
అయితే.. డ్రోన్లతో డెలివరీ విషయంలో కొన్ని సాంకేతిక పరమైన అంశాలపై పరీక్షలు జరగాల్సి ఉందంటున్నారు అమెజాన్ ప్రతినిధులు. ప్రస్తుతం డ్రోన్లతో డెలివరీకి సంబంధించి పరీక్షలు కొనసాగుతున్నాయి. గతంలో అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ కూడా డ్రోన్లతో డెలివరీ ప్రయత్నాల గురించి చెప్పారు. అతిత్వరలోనే సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని చెబుతున్నారు.
అమెజాన్ లో షాపింగ్ చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
ఇవి కూడా చదవండి :
- keerthy Suresh : కీర్తి సురేష్ బాగా తగ్గింది.. ఎందుకంటే..?
- ఆ ఒక్క మిస్టేక్ చెన్నకేశవరెడ్డి సినిమాని ఇండస్ట్రీ హిట్ గా నిలబెట్టలేకపోయింది!
- ఈ బస్ స్టాప్ మూవీ హీరోయిన్ ని గుర్తుపట్టారా!
- ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్’ ఫేం నాగరాజు భార్యను చూసారా!