Top
Batukamma

Amitshah Corona : బీజేపీ ఎంపీ అత్యుత్సాహం.. అమిత్ షా కు కరోనా తగ్గలేదు..!

Amitshah Corona : బీజేపీ ఎంపీ అత్యుత్సాహం.. అమిత్ షా కు కరోనా తగ్గలేదు..!
X
Highlights

Amitshah Corona Test : కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కరోనా నుంచి కోలుకున్న వార్తపై కేంద్ర హోంశాఖ క్లారిటీ...

Amitshah Corona Test : కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కరోనా నుంచి కోలుకున్న వార్తపై కేంద్ర హోంశాఖ క్లారిటీ ఇచ్చింది. అమిత్ షా ఇంకా కరోనా నుంచి కోలుకోలేదని.. చెప్పింది.

అమిత్ షా కరోనా నుంచి కోలుకున్నారని బీజేపీ ఎంపీ మనోజ్ తివారి ట్వీట్ చేశారు. పార్టీకి చెందిన ముఖ్య నేత ఈ విషయాన్ని ట్వీట్ చేయడంతో నిజంగానే కరోనా నుంచి అమిత్ షా కోలుకున్నారని అంతా అనుకున్నారు. మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనూ వార్తలు వచ్చాయి.

Amitshah corona అమిత్ షాకు కరోనా నెగెటివ్ అంటూ మనోజ్ తివారీ చేసిన ట్వీట్

అయితే.. దీనిపై కేంద్ర హోంశాఖ స్పందించింది. అసలు ఇవాళ అమిత్ షా కు కరోనా పరీక్షలు చేయలేదని చెప్పింది. ఆయన ప్రస్తుతం హాస్పిటల్ లోనే ట్రీట్మెంట్ పొందుతున్నారని వివరణ ఇచ్చింది.

ఇవి కూడా చదవండి :

Next Story
Share it