Top
Batukamma

Amrutha Cookery Show Video : యూట్యూబ్ లో అమృత వంటలు

Amrutha Cookery Show Video : యూట్యూబ్ లో అమృత వంటలు
X
Highlights

Amrutha Cookery Show Video : మిర్యాలగూడ అమృత చాలా మందికి తెలుసు కాదా. ప్రేమించిన ప్రణయ్ అనే యువకుడిని పెళ్లి...

Amrutha Cookery Show Video : మిర్యాలగూడ అమృత చాలా మందికి తెలుసు కాదా. ప్రేమించిన ప్రణయ్ అనే యువకుడిని పెళ్లి చేసుకుంది. అమృత తండ్రి అతడిని చంపించాడు. ఆ తర్వాత కొద్ది రోజులకు అమృత తండ్రి మారుతీరావు ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఈ ఎపిసోడ్ అంతా చాలామందికి తెలిసే ఉంటుంది.

ఈ ఇష్యూనే కథాంశంగా సినిమా తీస్తున్నట్టు రాంగోపాల్ వర్మ కూడా ప్రకటించాడు. దీనికి సంబంధించిన పోస్టర్ లు కూడా రిలీజ్ చేశాడు. ఇది కాంట్రవర్సీ అయ్యింది. దీనిపై అమృత ఫ్యామిలీ సీరియస్ కూడా అయ్యింది.

[embed]https://twitter.com/RGVzoomin/status/1279604382959468544[/embed]

అయితే.. అమృత మాత్రం ప్రస్తుతం ఈ కాంట్రవర్సీల్లోకి వెళ్లకుండా కూల్ గా జీవితం గడిపేస్తున్నట్టు కనిపిస్తోంది. ఇందులో భాగంగానే ఓ యూట్యూబ్ ఛానల్ ని ప్రారంభించింది.

ఇప్పటికే అందులో అమృత-ప్రణయ్ మ్యారేజ్ వీడియో ఉండగా.. ఇప్పుడు కొత్తగా మరో వీడియో పెట్టింది. వంటల ప్రోగ్రాంలాగా తన అత్తతో కలిసి గారెలు చేసి ఓ వీడియో యూట్యూబ్ లో పెట్టింది.

[embed]https://www.youtube.com/watch?v=LVn_ZRPe5sE&feature=youtu.be[/embed]

అయితే.. ఈ ఛానల్ ను ఇలాంటి వంటల ప్రోగ్రాంలకే పరిమితం చేస్తుందా..? వర్మకు కౌంటర్ ఇవ్వడానికి కూడా ఉపయోగిస్తుందా..? అనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే అమృతకు పబ్లిక్ లో ఫుల్ ఫాలోయింగ్ ఉంది.

అమృత పేరుతో ఫేస్ బుక్ లో వందలకొద్ది అకౌంట్లు, పేజ్ లు ఉన్నాయి. అటు.. ఈ యూట్యూబ్ ఛానల్ కు కూడా ఇప్పటికే 51 వేలకు పైగా సబ్ స్క్రైబర్స్ ఉన్నారు.

Next Story
Share it