Top
Batukamma

Anchor Ravi : ఆ యాంకర్ తో ఎఫైర్.. కన్నీరు పెట్టిన యాంకర్ రవి

Anchor Ravi : ఆ యాంకర్ తో ఎఫైర్.. కన్నీరు పెట్టిన యాంకర్ రవి
X
Highlights

Anchor Ravi Emotional About Family And Career : వినాయకచవిత స్పెషల్ ఈవెంట్లతో తెలుగు ఎంటర్ టైన్ మెంట్ ఛానళ్లు...

Anchor Ravi Emotional About Family And Career : వినాయకచవిత స్పెషల్ ఈవెంట్లతో తెలుగు ఎంటర్ టైన్ మెంట్ ఛానళ్లు హోరెత్తిస్తున్నాయి. అనుకున్నదొక్కటి.. అయ్యిందోకటి.. పేరుతో ఈటీవీ ఇప్పటికే ఓ షో టెలికాస్ట్ చేసింది. దీనికి పోటీగా జీ తెలుగు కూడా ఓ ప్రోగ్రాం రెడీ చేసింది. ఆదివారం (ఈ నెల23న) సాయంత్రం ఐదింటికి ఈ ప్రోగ్రాం టెలికాస్ట్ కానుంది

బాపు బొమ్మకి పెళ్లంట అనే కాన్సెప్ట్ తో.. మెగా డాటర్ నాగబాబు కూతురు నిహారిక సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా ఈ ప్రోగ్రాం కొనసాగనుంది. ఇప్పటికే ఈ ప్రోగ్రాంకు సంబంధించి చాలా ప్రోమోలు రిలీజ్ చేశారు. లెటెస్ట్ గా రిలీజ్ చేసిన ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది.

ఇందులో యాంకర్ రవి తన లైఫ్ గురించి చెబుతూ కన్నీళ్లు పెట్టుకోవడం అందరిని కలచివేసింది. అనసూయ, ఆమె భర్త భరద్వాజ్ కూడా ఇందులో స్టేజ్ పై కనిపించారు. ఈ నేపథ్యంలోనే యాంకర్ రవి తన మనసులోని మాటలు బయటకు చెప్పాడు.

“పెళ్లై ఎనిమిదేళ్లు.. కాని నాకు పెళ్లైందని రివీల్ చేసింది ఏడాదిన్నర క్రితం. ఆరున్నరేళ్లు మా ఆవిడ నా వల్ల ఎంత టార్చర్ అనుభవించిందో నాకుతెలుసు.. కానీ ఎప్పుడు నా దగ్గరకు వచ్చి నేను ఇలా ఫీల్ అవుతున్నానని చెప్పలేదు. ఎందుకంటే ఇండస్ట్రీలో ఉండాలి.. పేరు తెచ్చుకోవాలని ముందుకెళ్లున్న్పుడు పెళ్లైందని తెలిస్తే ఛాన్స్ లు ఉండవు. క్రేజ్ తగ్గిపోతుంది. నాకు ఆ టైంలో జోడీ జోడీ అని ఎక్కువగా వినిపించేది.

ఆ టైంలో ఏంటీ మీ ఆయన ఆవిడతో ఉన్నడట కదా.. ఈమెతో ఎఫైర్ ఉందంట కదా.. మీ ఆయనకు ఇంకో పెళ్లైందా..? లాంటివి నా భార్య చాలా విన్నది. కానీ నా వరకు చాలాసార్లు చెప్పింది. కానీ నవ్వుతూనే చెప్పేది. ఆమెను ఎంతో టార్చర్ పెట్టా..ఎన్నిసార్లు ఆమె నిద్ర నటిస్తూ ఏడిచిందో నాకు తెలుసు.. ఆ సౌండ్ నాకు వినపడేది.

anchor ravi wife

నా ఫ్యామిలీని నిలబెట్టింది.. ఈ రోజు నన్ను ఈ స్టేజ్ మీద నిలబెట్టింది నా భార్య నిత్స సక్సేనా. అన్ని ఇగోలు పక్కనపెట్టి నా కోసం చాలా చేసింది. నిన్న బాధపెట్టినందుకు సారీ నీతూ.. నువ్ ఇది చూస్తావ్ అని నాకు తెలుసు.. నన్ను క్షమించు.. అంటూ కన్నీళ్లు పెడుతూ.. స్టేజ్ పై మోకాళ్లపై కూర్చుని తన భార్యకు సారీ చెప్పాడు.

నిజానికి గతంలో యాంకర్ రవి, లాస్య కలిసి ఓ ప్రోగ్రాం చేశారు. స్టేజ్ షోలపైనా ఇద్దరు కలిసి కనిపించేవారు. దీంతో వీరిద్దరి మధ్య ఏదో ఉందని.. ఇద్దరికి పెళ్లైపోయిందని చాలా రూమర్స్ చక్కర్లు కొట్టాయి. యూట్యూబ్ లో అయితే వీరి రిలేషన్ గురించి కుప్పలు తెప్పలుగా వీడియోలు వచ్చాయి.

lasya ravi

దీంతో ఇప్పుడు తాను, తన భార్య అనుభవించిన కష్టం గురించి ఇలా జీ తెలుగు వేధికగా బయటపెట్టేశాడు యాంకర్ రవి.

Next Story
Share it