మానవత్వం చాటుకున్న మహిళ మంత్రులు..

X
Highlights
ఆ సమయంలో అటు వైపుగా వెళ్తున్న మంత్రులు మేకతోటి సుచరిత, తానేటి వనిత తమ కాన్వాయ్ ని ఆపి నరసింహారావుని తమ కాన్వాయ్‌లో ఎక్కించి ఆసుపత్రికి తరలించారు..
Batukamma5 Nov 2020 1:09 PM GMT
ఆంధ్రప్రదేశ్ మహిళ మంత్రులు మేకతోటి సుచరిత, తానేటి వనిత తమ మానవత్వాన్ని చాటుకున్నారు... గురువారం కరకట్ట రోడ్డుపై వెళుతున్నసమయంలో దొండపాడుకు చెందిన నరసింహారావు అనే వ్యక్తిని ఆటో ఢీకొట్టింది.. ఈ క్రమంలో నరసింహారావు తీవ్ర గాయాలు అయ్యాయి..
ఆ సమయంలో అటు వైపుగా వెళ్తున్న మంత్రులు మేకతోటి సుచరిత, తానేటి వనిత తమ కాన్వాయ్ ని ఆపి నరసింహారావుని తమ కాన్వాయ్‌లో ఎక్కించి ఆసుపత్రికి తరలించారు.. ప్రస్తుతం నరసింహారావు పరిస్థితి బాగానే ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు..
తనకి సహాయం అందించిన మంత్రులకి నరసింహారావు ధన్యవాదాలు తెలిపాడు... ఈ రోజు ఏపీ కాబినెట్ సమావేశం అయిన సంగతి తెలిసిందే.. కాబినెట్ సమావేశాన్ని పూర్తి చేసుకొని తిరిగి వస్తున్న క్రమంలో మంత్రులకి ఈ సంఘటన ఎదురైంది..
Next Story