Andhrapradesh : అల్లుడి తలతో స్టేషన్ కు వెళ్లిన మామ.. పోలీసులు షాక్

Andhrapradesh Son inlaw beheaded by uncle : ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లాలో దారుణం జరిగింది....
Andhrapradesh Son inlaw beheaded by uncle : ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లాలో దారుణం జరిగింది. కూతురిని చంపాడని అల్లుడిపై పగ పెంచుకున్న మామ.. అతని తలనరికి.. తల పట్టుకుని నేరుగా పోలీస్ స్టేషన్ కే వెళ్లాడు.
తూర్పుగోదావరి (Andhrapradesh) జిల్లా రౌతులపూడి మండలం డిజె పురంలో ఈ ఘటన జరిగింది. డిజెపురానికి చెందిన పల్లా సత్యనారాయణ కూతురు గతేడాది అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయింది.
- బీజేపీ ఎంపీ అత్యుత్సాహం.. అమిత్ షా కు కరోనా తగ్గలేదు..!
- జస్ట్ మూడు రోజులే.. కరోనా వ్యాక్సిన్ వచ్చేస్తోంది..!
- రాణా భార్య మిహీక పెళ్లి డ్రెస్ ఖరీదెంతో తెలుసా..?
ఆమెకు ఇద్దరు కూతుళ్లున్నారు. వాళ్లు ఇప్పుడు తాత దగ్గరే ఉంటున్నారు. వారిని చూసేందుకు వారి తండ్రి డిజెపురం వచ్చాడు. అల్లుడు ఇంటికి వచ్చాడని మద్యం తేవడంతో ఇద్దరు తాగారు.
అయితే.. తాగిన మైకంలో భార్యను తానే చంపానని చెప్పాడు. దీంతో ఆగ్రహానికి గురైన సత్యనారాయణ.. అల్లుడిని అక్కడే చంపేశాడు. మొండెం నుంచి తలను వేరుచేశాడు. తలను సంచిలో వేసుకుని పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు.