Top
Batukamma

Araku : అరకు లోయలో బస్సు బోల్తా.. 8 మంది మృతి

Araku : అరకు లోయలో బస్సు బోల్తా.. 8 మంది మృతి
X
Highlights

అరకు నుంచి విశాఖ వస్తుండగా ఘాట్‌ రోడ్డులో ప్రమాదం జరిగింది. .

అరకు ఘాట్‌ రోడ్డులో ఘోర ప్రమాదం జరిగింది. డముకు సమీపంలో పర్యాటకుల బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది .

క్షతగాత్రుల్ని విజయనగరం జిల్లా ఎస్‌.కోట హాస్పిటల్‌కు తరలించారు. అరకు నుంచి విశాఖ వస్తుండగా ఘాట్‌ రోడ్డులో ప్రమాదం జరిగింది. .

ప్రమాదంలో మృతిచెందిన వాళ్లు హైదరాబాద్‌ వాసులు అని తెలుస్తోంది. సుమారు 30 మంది బస్సులో విశాఖకు పర్యటనకు వెళ్లారు. అరకు పర్యటన ముగించుకుని... తిరిగి విశాఖ వస్తుండగా అరకు ఘాట్‌ రోడ్డులో అదుపుతప్పి లోయలో బోల్తాపడింది.

ప్రమాద సమయంలో 30 మంది ఉండగా... ఇందులో 8 మంది మృతి చెందారు. రాత్రి సమయం కావడంతో సహాయక చర్యలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి.







Next Story
Share it