Top
Batukamma

ప్రియుడు మోసం చేశాడని శోభనాన్ని అడ్డుకున్న ప్రియురాలు!

ప్రియుడు మోసం చేశాడని శోభనాన్ని అడ్డుకున్న ప్రియురాలు!
X
Highlights

ప్రియుడు మోసం చేసి వేరే మరో అమ్మాయిని పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్లగా ప్రియురాలు వెళ్లి ఆ శోభనాన్ని అడ్డుకున్న ఘటన పెద్దపంజాణి పోలీస్ స్టేషన్ పరధిలో చోటుచేసుకుంది.

ప్రియుడు మోసం చేసి వేరే మరో అమ్మాయిని పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్లగా ప్రియురాలు వెళ్లి ఆ శోభనాన్ని అడ్డుకున్న ఘటన పెద్దపంజాణి పోలీస్ స్టేషన్ పరధిలో చోటుచేసుకుంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. పెద్దపంజాణి మండలం కెళవాతి గ్రామానికి చెందిన శ్రావణి (21), గంగవరం మండలం మిట్టమీద కురప్పల్లి గ్రామానికి చెందిన గణేష్ (23)కి కాలేజీ నుంచి పరిచయం ఉండడంతో ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది.

అలా ఇద్దరు కలిసి గత 6 సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. ఇక గత 11నెలల క్రితం నుంచి గణేష్ బెంగళూరులో శ్రావణి పనిచేసే కంపెనీలో ఉద్యోగంలోనికి చేరాడు. అలా ఇద్దరు మరింతగా దగ్గరయ్యారు. ఎలాగు పెళ్లి చేసుకుంటామనే ఉద్దేశంతో కాస్తా అడ్వాన్స్ అయ్యారు. అలా మూడు నెలలుగా సహజీవనం చేశారు. అయితే వీరి ప్రేమలో లాక్ డౌన్ చిచ్చుపెట్టింది.

కరోనా వలన లాక్ డౌన్ రావడంతో గణేష్ తన సొంత గ్రామానికి చేరుకున్నాడు. ఈ క్రమంలో గణేష్ కి ఇంట్లో పెళ్లి సంబంధాలు చూడడంతో, ఈ విషయాన్ని శ్రావణి దగ్గర దాస్తూ గణేష్ బుధవారం గంగవరం మండలం కలగటురు గ్రామానికి చెందిన తమ బంధువుల అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అయితే ఈ విషయాన్ని ఎలాగోలా తెలుసుకున్నా శ్రావణి గురువారం రాత్రి పెద్దపంజాణి మండలంలో పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఆమె ఫిర్యాదు మేరకు గణేష్ పై ఐపిసి సెక్షన్ 417, 420 కేసులు నమోదు చేశారు పోలీసులు. అంతేకాకుండా శ్రావణి అదే రోజు రాత్రి కలగటూరు గ్రామానికి వెళ్లి గణేష్ శోభనాన్ని అడ్డుకుంది. ఈ క్రమంలో పోలీసులు శ్రావణికి నచ్చజెప్పి అక్కడి నుంచి పంపివేశారు. ఇక శుక్రవారం ఉదయం పోలీస్ స్టేషన్ కు శ్రావణి వెళ్లి తనకు న్యాయం చేయాలని పోలీసులని వేడుకుంది.

ఇక దీనిపైన S.I.మల్లికార్జున రెడ్డి మాట్లాడుతూ శ్రావణి అనే అమ్మాయి ప్రియుడు మోసం చేసి అతని బంధువుల అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని పిర్యాదు చేసిందని కేసును నమోదు చేసిందని, దానిపైన దర్యాప్తు చేస్తున్నట్టుగా వెల్లడించారు.

Next Story
Share it