Top
Batukamma

కరోనాతో ఒకే కుటుంబంలో నలుగురు మృతి!

కరోనాతో ఒకే కుటుంబంలో నలుగురు మృతి!
X
Highlights

కరోనాతో ఒకే కుటుంబంలో నలుగురు చనిపోయిన ఘటన విజయవాడలో చోటు చేసుకుంది. స్థానికంగా ఈ ఘటన అందరిని కలవరపరిచింది.

కరోనాతో ఒకే కుటుంబంలో నలుగురు చనిపోయిన ఘటన విజయవాడలో చోటు చేసుకుంది. స్థానికంగా ఈ ఘటన అందరిని కలవరపరిచింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. విజయవాడకు చెందిన ఓ న్యాయవాది తల్లి కరోనాతో అక్టోబర్ 8వ తేదీన మరణించగా, గత నెల 30వ తేదీన సదరు న్యాయవాది భార్య కూడా చనిపోయింది.

అయితే భార్య అంత్యక్రియలు చేస్తున్న సమయంలో న్యాయవాది కూడ మరణించాడు. ముగ్గురు కూడా కరోనాతోనే మరణించడంతో న్యాయవాది కొడుకికి ఎక్కడ లేని శోకాన్ని మిగిల్చింది. ఇది ఇలా ఉండగా మరో పక్కా కరోనాతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ న్యాయవాది కొడుకు కూడా ఆదివారం మృతి చెందాడు.



ఒకే కుటుంబంలో నలుగురు చనిపోవడంతో బంధవులు సన్నిహితులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. కరోనా విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే ఇలాంటి ఇబ్బందులు తప్పవని అధికారులు అంటున్నారు. కరోనాకి వ్యాక్సిన్ వచ్చేవరుకు ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే నష్టం తప్పదని హెచ్చరిస్తున్నారు.

అటు ఏపీలో కరోనా కేసుల సంఖ్య 8,25,966కి చేరింది. ఆదివారం నాటికి ఉన్న సమాచారం మేరకు గడిచిన 24 గంటల వ్యవధిలో 88,780 శాంపిల్స్ టెస్ట్ చేయగా 2,618 మందికి కరోనా సోకింది. ప్రస్తుతం రాష్ట్రంలో 23,668 యాక్టివ్‌ కేసులుండగా, ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 7,79,592 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

Next Story
Share it