Top
Batukamma

అవ్వా.. బాగున్నావనే అంటూ రూ. 20 వేలు మస్కా!

అవ్వా.. బాగున్నావనే అంటూ రూ. 20 వేలు మస్కా!
X
Highlights

ఈ రోజుల్లో ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో అర్ధం కావడం లేదు.. పక్కన ఉన్నవాళ్ళే మోసాలు చేస్తున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.

ఈ రోజుల్లో ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో అర్ధం కావడం లేదు.. పక్కన ఉన్నవాళ్ళే మోసాలు చేస్తున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఓ అవ్వా బాగున్నావా అంటూ మాటలు కలిపి ఓ వృద్దురాలు దగ్గర రూ. 20 వేలు కొట్టేశాడు. ఈ ఘటన చిత్తూరు జిల్లాలోని పలమనేరులో చోటుచేసుకుంది.

పోలీసుల వివరాల ప్రకారం... గంగవరం మండలం కలిమిచెట్లపెంటకు చెందిన మునిరత్నమ్మ(65) సొంతపనిపై పలమనేరుకు మంగళవారం వచ్చింది. అయితే అక్కడ ఓ ఆరిచితుడు కలిసి అవ్వా.. బాగున్నావనే అంటూ మాటలు కలిపాడు. తనది చిత్తూరని, మీ కొడుకు ఫ్రెండ్‌నంటూ మాటలు కలిపాడు.

నీ కొడుకు అర్జెంట్‌గా తన తల్లి మునిరత్నమ్మ వద్ద రూ.20 వేలు తీసుకుని రావాలని తనను పంపాడంటూ చెప్పుకొచ్చాడు. అయితే తన మనవరాలికి ఆరోగ్యం బాగాలేక ఆమె కొడుకు చిత్తూరుకు వెళ్లిఉండడంతో ఇది నిజమేనని నమ్మింది మునిరత్నమ్మ.

వెంటనే తన చెవిలోని కమ్మల్ని కుదువ పెట్టి రూ.25వేలకు తాకట్టు పెట్టింది. అందులో అయిదు వేలు ఉంచుకొని.. రూ. 20 వేలు ఇచ్చింది. అయితే సాయంత్రం ఇంటికి వచ్చిన కొడుక్కి ఈ విషయం చెప్పింది. దీనితో అవాక్కైన ఆమె కొడుకు వెంటనే పోలీసులకి ఫిర్యాదు చేశాడు.

వెంటనే పోలీసులు ఇలాంటి నేరాలకు పాల్పడిన వ్యక్తుల ఆధారంగా నిందితుడైన సెంధిల్‌కుమార్‌(35)ను అరెస్ట్ చేసి అతని దగ్గరనుంచి రూ. 20 వేలు స్వాధీనం చేసుకున్నారు. పరిచయం లేని వ్యక్తుల మాటలు నమ్మీ మోసపోవద్దని ఎస్‌ఐ నాగరాజు సూచించారు.

Next Story
Share it