Top
Batukamma

గంటలో పెళ్లనగా పోలిసుల ఎంట్రీ.. నిజం ఒప్పుకున్న నవవధువు!

గంటలో పెళ్లనగా పోలిసుల ఎంట్రీ.. నిజం ఒప్పుకున్న నవవధువు!
X
Highlights

పెళ్ళికి అన్ని సిద్దం అయ్యాయి.. వరుడు, వధువు, బంధువులు, పూజారి అంత ఉన్నారు. ఓ గంటల్లో ఆ మూడుముళ్ళు కూడా పడి పెళ్లి కూడా అయిపోతుంది.

పెళ్ళికి అన్ని సిద్దం అయ్యాయి.. వరుడు, వధువు, బంధువులు, పూజారి అంత ఉన్నారు. ఓ గంటల్లో ఆ మూడుముళ్ళు కూడా పడి పెళ్లి కూడా అయిపోతుంది. అచ్చం సినిమాలో లాగే చివర్లో పోలిసులు ఎంట్రీ ఇచ్చి ఆపండి అన్నారు. అంతే పెళ్లి ఆగిపోయింది.

ఇంతకి ఎం జరిగిదంటే.. కడపకు చెందిన ఓ యువతి చెన్నైలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా పనిచేస్తోంది. తన ఆఫీస్ లోనే పనిచేసే చెన్నై యువకుడితో ప్రేమలో పడింది. అయితే ఈ విషయం తన ఇంట్లో చెప్పక తన అమ్మానాన్నలు చూపించిన అబ్బాయినే పెళ్లి చేసుకోవడానికి అంగీకరించింది.

అలా గుర్రంకొండకు చెందిన ఓ అబ్బాయితో శుక్రవారం పెళ్లి ఫిక్స్ అయింది. అప్పటివరకు అలా సజావుగా సాగుతున్న పెళ్లిలోకి అనుకోని అతిధి లాగా పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. కారణం యువతి ప్రియుడు తమిళనాడు పోలీసులకు, కడప పోలీసులకు ఫిర్యాదు చేయడమే!

అతని ఫిర్యాదు మేరకు స్థానిక హెడ్‌కానిస్టేబుల్, నలుగురు కానిస్టేబుళ్లు, ఇద్దరు మహిళా పోలీసులు కలిసి కల్యాణ మండపానికి చేరుకొని జరిగిన విషయాన్ని వివరించారు. ఈ విషయంలో యువతిని ప్రశ్నించగా తనకీ పెళ్లి ఇష్టం లేదని, ప్రేమ విషయాన్ని భయపెట్టింది.

ఉదయం ఎనమిది గంటల వరకు పంచాయితీ నడించింది కానీ యువతి మాత్రం ప్రియుడుతో వెళ్లడానికే మొగ్గుచూపింది. దీనితోచేసేది ఏమీ లేకా పెళ్లికొడుకు బృందం పెళ్లి మండపం నుంచి వెళ్ళిపోయారు. చివరకు పోలీసులు ప్రియుడిని, నవవధువు తల్లిదండ్రులను కడపకు పంపించి వేశారు.

Next Story
Share it