Top
Batukamma

చీర కట్టు.. బొట్టు పెట్టు.. తిట్టు.. పదవి పట్టూ.. !

చీర కట్టు.. బొట్టు పెట్టు.. తిట్టు.. పదవి పట్టూ.. !
X
Highlights

టీడీపీ నుంచి తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలు పెట్టిన ఆమె.. ఆ పార్టీలో బలమైన గళం కల మహిళా నాయకురాలుగా ఎదిగారు.

రాజకీయాల్లోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు బీజేపీ నేత సాధినేని యామని.. ముందుగా టీడీపీ నుంచి తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలు పెట్టిన ఆమె.. ఆ పార్టీలో బలమైన గళం కల మహిళా నాయకురాలుగా ఎదిగారు. దీనితో ఆమెను టీడీపీ అధికార ప్రతినిధిగా చంద్రబాబు ఆమెను నియమించారు.

పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేసి మోస్ట్ హాట్ టాపిక్ గా మారింది యామని.. అయితే రాష్ట్ర ఎన్నికల అనంతరం ఆమె టీడీపీని వీడి బీజేపీలో చేరింది. బీజేపీలో చేరిన ఏడాదికే యామనికి కీలక పదవిని కట్టబెట్టింది ఆ పార్టీ. ఆమెకు మహిళా మోర్చా రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలను అప్పజెప్పింది. పార్టీలో మంచి గుర్తింపు దక్కడంతో ఆమె సంతోషాన్ని వ్యక్తం చేసింది.

అయితే యామనికి కీలక పదవి దక్కడం పట్ల సినీ నటి, బీజేపీ నాయకురాలు మాధవిలత ఘాటుగా స్పందించింది. ఎక్కడ కూడా యామిని పేరును ప్రస్తావించకుండా మాధవీలత తీవ్రంగా విమర్శించింది. జంపింగ్ జపాంగ్‌లకే పార్టీ నేతలు కీలక పదవులు ఇస్తున్నారని, కష్టపడి పార్టీ కోసం పని చేసే వాళ్లకు గౌరవం ఉండదంటూ తన ఆవేదనను వ్యక్తం చేశారు.

"కాలింది అనుకోండి.. కడుపు మంట అనుకోండి.. కాని నేను చెప్పేది నిజం.. పచ్చ కండువాలు కప్పుకుని పచ్చి బూతులు తిట్టి అధికారం ఇవ్వకపోతే పార్టీ వారికే పదవులంటూ మాధవీలత విమర్శించారు. ఇదే ఇష్యూ పైన సినీ నటి పూనమ్ కౌర్ కూడా ఇన్ డైరెక్ట్ గా స్పందించారు. చీర కట్టు.. బొట్టు పెట్టు.. తిట్టు.. పదవి పట్టూ అంటూ ట్వీట్ చేశారు.

Next Story
Share it