Top
Batukamma

ఆరేళ్ళ తరవాత కేసీఆర్ ను మళ్ళీ గెలుకుతున్న పవన్!

ఆరేళ్ళ తరవాత కేసీఆర్ ను మళ్ళీ గెలుకుతున్న పవన్!
X
Highlights

2014లో జరిగిన అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో టీడీపీ, బీజేపీ కూటమికి జనసేనని మద్దతు ప్రకటించారు. ఆ సమయంలో కూటమి తరుపున ప్రచారం కూడా చేసిన పవన్ టీఆర్ఎస్‌పై తీవ్ర విమర్శలు చేశారు.

తెలంగాణ సీఎం కేసీఆర్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మళ్ళీ ప్రత్యర్థులుగా మారనున్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నాయి GHMC ఎలక్షన్స్. అవును దాదాపుగా ఆరేళ్ళ తరవాత మరోసారి సీఎం కేసీఆర్ ని టార్గెట్ చేయబోతున్నారు పవన్.

2014లో జరిగిన అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో టీడీపీ, బీజేపీ కూటమికి జనసేనని మద్దతు ప్రకటించారు. ఆ సమయంలో కూటమి తరుపున ప్రచారం కూడా చేసిన పవన్ టీఆర్ఎస్‌పై తీవ్ర విమర్శలు చేశారు.

పవన్ వ్యాఖ్యలకి కేసీఆర్ కూడా గట్టిగానే కౌంటర్ కూడా ఇచ్చారు. అయితే ఆ తరవాత రాజకీయ పరిణామాలు పూర్తిగా మారిపోయాయి. ఇద్దరు చాలా సార్లు భేటి అయ్యారు. ఇద్దరి మధ్య మంచి సఖ్యత కూడా ఏర్పడింది.

ఈ క్రమంలో ఏపీలో కేసీఆర్, పవన్ కి సపోర్ట్ చేస్తారని అందరూ ఉహించారు. అయితే కేసీఆర్, జగన్ కి సపోర్ట్ ఇచ్చారు. అప్పటి నుంచి కేసీఆర్‌కు పవన్ కళ్యాణ్‌కు మధ్య దూరం పెరుగుతూ వచ్చింది.

అయితే మళ్ళీ ఇద్దరు విమర్శించుకునే అవకాశం GHMC ఎన్నికల ద్వారా వచ్చింది. చివరి నిమిషం వరకు జనసేన బరిలో ఉంటుదని అనుకున్న వారికీ పవన్ షాక్ ఇచ్చారు. పోటి నుంచి తప్పుకుంటూ బీజేపీకి మద్దతు ఇస్తున్నట్టుగా ప్రకటించారు పవన్.

మద్దతు అంటే పవన్ బీజేపీ తరపున ప్రచారం చేయాల్సి ఉంటుంది. ఒకవేళ పవన్ మళ్ళీ ప్రచారం చేస్తే కనుక అధికార టీఆర్ఎస్ పార్టీ పైన, సీఎం కేసీఆర్ పైన పవన్ విమర్శలు చేయాల్సి ఉంటుంది. పవన్ కామెంట్స్ చేస్తే, కేసీఆర్ అండ్ కో సైతం పవన్ కళ్యాణ్‌కు గట్టి కౌంటర్ ఇవ్వడం కూడా ఖాయమే.

Next Story
Share it