జగన్ కి షాక్... షర్మిల పార్టీలోకి ప్రముఖ యాంకర్!

హైదరాబాద్‌లోని తన నివాసం లోటాస్ పాండ్‌లో మీటింగ్ ఏర్పాటు చేసి.. పార్టీ భవిష్యత్త కార్యచరణ ఏంటో తెలియజేశారు. ఇప్పటికే కొంతమంది నేతలతో భేటి అయిన షర్మిల..
తెలంగాణ రాష్ట్రంలో దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనను తీసుకురావడమే తన లక్ష్యమని.. అందుకే తాను కొత్త పార్టీని తెలంగాణలో స్థాపిస్తున్నట్టుగా వైఎస్ షర్మిల తాజాగా ప్రకటించిన సంగతి తెలిసిందే.
హైదరాబాద్‌లోని తన నివాసం లోటాస్ పాండ్‌లో మీటింగ్ ఏర్పాటు చేసి.. పార్టీ భవిష్యత్త కార్యచరణ ఏంటో తెలియజేశారు. ఇప్పటికే కొంతమంది నేతలతో భేటి అయిన షర్మిల.. ఇక ఈ నెల 21 ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతలతో భేటీ నిర్వహించనున్నారు.
ఇక ఇదిలా ఉండగా అప్పుడే షర్మిల పెట్టబోయే ఈ పార్టీలోకి అప్పుడే చేరికలు మొదలయ్యాయి. తాజాగా తెలుగు యాంకర్ శ్యామల, ఆమె భర్త నర్సింహారెడ్డితో కలిసి, షర్మిల భర్త బ్రదర్ అనీల్‌ను కలిశారు. అయితే బుధవారం బ్రదర్ అనిల్ పుట్టినరోజు కావడంతోనే కలిసినట్లుగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటో పోస్ట్ చేసింది శ్యామల.. ఫ్రెండ్లీ మీటింగ్ అంటూ క్యాప్షన్ పెట్టింది.
అయితే పక్కా ఇది పొలిటికల్ మీటింగ్ అంటూ మరోవైవు చర్చ నడుస్తోంది. కాగా ఏపీలో గత ఎన్నికల సమయంలో తన భర్తతో కలిసి వైసీపీలో చేరింది శ్యామల.. వీరు ఇప్పుడు ఏపీలో కంటే తెలంగాణలో ఎక్కువగా ఉంటున్నారు.. కాబట్టి షర్మిల పార్టీలో జాయిన్ అయితే బెటర్ అనే ఆలోచనలో వీరు ఉన్నట్టుగా ప్రచారం నడుస్తోంది.
మరి శ్యామల నిజంగానే పొలిటికల్ ఎంట్రీ ఇస్తుందా..? లేదా? అన్నది చూడాలి!