Top
Batukamma

మద్యం ప్రియులకి ఏపీ ప్రభుత్వం మరో షాక్!

మద్యం ప్రియులకి ఏపీ ప్రభుత్వం మరో షాక్!
X
Highlights

దశలవారీ మద్యం నియంత్రణకి ఏపీ ప్రభుత్వం కంకణం కట్టుకున్న సంగతి తెలిసిందే.. ఆ దిశగానే సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అడుగులు వేస్తున్నారు.

దశలవారీ మద్యం నియంత్రణకి ఏపీ ప్రభుత్వం కంకణం కట్టుకున్న సంగతి తెలిసిందే.. ఆ దిశగానే సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగానే మద్యం ప్రియులకి మరో షాక్ ని ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. ఇక పైన ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తెచ్చుకోవటాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

పర్మిట్లు, లైసెన్స్‌ లేకుండా ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తెచ్చుకోవటంపైన ఎక్సైజ్‌ శాఖ కొత్త జీవోను కూడా విడుదల చేసింది. దీనితో గతంలో లాగా మూడు మద్యం బాటిల్స్‌ తెచ్చుకునేందుకు అనుమతి లేదు. ఒకవేళ ఎవరైనా రూల్స్ బ్రేక్ చేస్తే శిక్ష ఉంటుందని అధికారులు వెల్లడించారు.

అక్రమ మద్యం రవాణాను అరికట్టడానికి ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సరిహద్దుల్లో ఉన్న ఆరు రాష్ట్రాల్ల నుండి ఒక్కొక్కరు మూడు బాటిల్స్‌కు మించకుండా మద్యం తీసుకొని రావటాన్ని నిరోధిస్తూ ఈ నెల 26వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.

ఇక ఇతర దేశాలనుంచి మద్యం తెచ్చుకునేందుకు కేంద్ర ప్రభుత్వ అనుమతుల మేరకు మాత్రమే అనుమతి ఉంటుందని జారీ చేసిన ఉత్తర్వులో పేర్కొంది.

Next Story
Share it