Top
Batukamma

జగన్ అంటే ఏపీ మీడియాకు ఎందుకంత భయం..? కనీసం ప్రజల కష్టాలను చూపించలేరా..?

జగన్ అంటే ఏపీ మీడియాకు ఎందుకంత భయం..? కనీసం ప్రజల కష్టాలను చూపించలేరా..?
X
Highlights

రావాల్సినవి ఆగిపోతాయని ఆ సెక్షన్ మీడియాకు భయమా..? లేక తెలంగాణ సర్కారును డీ ఫేమ్ చేయాలనే ప్లానా..? టీడీపీ మౌత్ పీస్ ఛానల్ కూడా ఏపీ వర్షాలు, వరద కష్టాలను హైలైట్ చేయకపోవడం బాధాకరం.

"తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ లో వర్షం, వరద బీభత్సం విపరీతంగా ఉంది. సగానికి పైగా హైదరాబాద్ మునిగిపోయింది. ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదు. హైదరాబాద్ భవిష్యత్ ఏంటీ..?" ఇవి ప్రస్తుతం తెలుగు మీడియాలో కొద్ది రోజులుగా కనిపిస్తున్న వార్తలు.

నిజమే హైదరాబాద్ లో భారీ వర్షం పడింది. వందలాది కాలనీలు నీట మునిగాయి. జనం ఇబ్బందులు పడుతున్నారు. వారి ఇబ్బందులను మీడియా.. ప్రజలకు చూపిస్తోంది. ఏయే పార్టీ మీడియా.. ఆయా పార్టీ రూల్స్ కు అనుగుణంగా వర్షం వార్తలు కవర్ చేస్తోంది.

అంతా బాగానే ఉంది. కానీ వర్షాలు కేవలం హైదరాబాద్ లోనే పడుతున్నాయా..? ఆంధ్రప్రదేశ్ లో పడటం లేదా..? అక్కడ చినుకు కూడా రాలకుండా ఎండాకాలం మాదిరిగా ఎండలు మండిపోతున్నాయా..? అంటే అదీ లేదు.

ఆంధ్రప్రదేశ్ లో కూడా భారీ వర్షాలు పడుతున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ కంటే ఎక్కువే వర్షం పడుతోంది. తీర ప్రాంతం కావడంతో తెలంగాణ కంటే ఏపీ పైనే ఎక్కువ ప్రభావం ఉంటుంది. కృష్ణా, ఉభయగోదావరి, గుంటూరు జిల్లాల్లో వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. ఇళ్లలోకి నీరు చేరింది. అక్కడ కూడా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

కానీ.. మీడియా ఫోకస్ మొత్తం హైదరాబాద్ మీదే ఉంది. ప్రపంచపటంలో హైదరాబాద్ లేకుండా.. తుడిచిపెట్టుకుపోతోంది అన్నంతగా హైదరాబాద్ ను చూపిస్తోంది ఓ వర్గం మీడియా. కానీ ఏపీలో ప్రజల కష్టాల గురించి మాత్రం పట్టించుకోవడం లేదు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయంగా.. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేశారు. అంటే.. ఏదో నాలుగు చినుకులు పడి పోతే.. సీఎం ఏరియల్ సర్వే చేయాల్సిన అవసరం లేదు కదా. అంటే అక్కడ కూడా వర్షం, వరద బీభత్సం ఉందనే కదా అర్థం.

మరి హైదరాబాద్ లో తిష్ట వేసిన మెజార్టీ ఏపీ మీడియా ఎందుకు ఈ విషయాన్ని చూపించడం లేదు. కనీసం ఒక్క వార్త కూడా వేయడం లేదు.? మొత్తం హైదరాబాద్ మీదే పడి ఏడుస్తోంది..?

ఏపీలో పరిస్థితి చూపిస్తే జగన్ సర్కారు నుంచి రావాల్సినవి ఆగిపోతాయని ఆ సెక్షన్ మీడియాకు భయమా..? లేక తెలంగాణ సర్కారును డీ ఫేమ్ చేయాలనే ప్లానా..? టీడీపీ మౌత్ పీస్ ఛానల్ కూడా ఏపీ వర్షాలు, వరద కష్టాలను హైలైట్ చేయకపోవడం బాధాకరం.

Next Story
Share it