ఆంధ్రప్రదేశ్ కొత్త ఓటరు జాబితా ఇదే..!

8 ఏళ్లు నిండిన ప్రతీ ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకోవాలని.. డిసెంబర్ 15 వరకు ఓటరు నమోదు ప్రక్రియ కొనసాగుతుందన్నారు.
ఆంధ్రప్రదేశ్ లోని ఓటర్ల ముసాయిదా జాబితా విడుదల చేసింది ఎన్నికల సంఘం. రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 4,01,45,674ఉన్నట్టుగా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి తెలిపారు. ఇందులో స్థానికులతో పాటు, ఎన్నారైలు కూడా ఉన్నారన్నారు.
ఓటరు జాబితా ప్రకారం ఏపీలో మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. పురుష ఓటర్లు 1,97,91,597 కాగా మహిళా ఓటర్ల సంఖ్య 2,02,83,145. థర్డ్ జెండర్ ఓటర్ల సంఖ్య 4,083కి చేరింది. సర్వీస్ ఓటర్లు 66,649, ఎన్నారై ఓటర్ల సంఖ్య 7,126గా ఉంది.
కొత్తగా ఓటు నమోదు చేసుకున్న వారి సంఖ్యలో ఏపీలో ఎక్కువగానే ఉంది. 18-19 ఏళ్ల వయస్సున్న వారు 1,03,336 మంది ఉన్నారు.
2020లో తుది ఓటర్ల జాబితా ప్రకటించిన తర్వాత ముసాయిదా జాబితాలో 3,26,824 మంది ఓటర్లు కొత్తగా నమోదయ్యారు.
ఓటరు నమోదు ప్రక్రియ కొనసాగుతుందని అధికారులు ప్రకటించారు. 18 ఏళ్లు నిండిన ప్రతీ ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. డిసెంబర్ 15 వరకు ఓటరు నమోదు ప్రక్రియ కొనసాగుతుందన్నారు. ఎన్నికల కమిషన్ వెబ్ సైట్ లో యువత ఓటరుగా నమోదుచేసుకోవచ్చన్నారు. జనవరి 15 తర్వాత తుది ఓటర్ల జాబితా ప్రకటించనున్నారు.
- TRS- కిషన్ రెడ్డి చీకటి దోస్తీ...! చిట్టా విప్పిన రేవంత్ రెడ్డి
- అమ్మడూ.. అంటూ యూట్యూబ్ ను కుమ్మేస్తున్న రోజా, శేఖర్ మాస్టర్