Top
Batukamma

AP panchayat Results:ఫలితాలతో నిమ్మగడ్డకు షాక్.. జోష్ లో వైసీపీ..!

Andhrapradesh panchayat election Results
X
Highlights

స్టేట్ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్(nimmagadda ramesh) కు సర్కారుకు మద్య వివాదాల మధ్య ఈ ఎన్నికలు జరిగాయి.

Andhrapradesh panchayat election Results: ఆంధ్రప్రదేశ్ లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్(ysrcp) పార్టీ దూకుడు కనిపించింది. ఏపీలో మొత్తం 13,371 గ్రామ పంచాయతీలు(village panchayats) ఉండగా, నాలుగు విడతల్లో కలిపి 13,097 గ్రామ పంచాయతీలలో ఎన్నికలు జరిగాయి.

ఇందులో 10 వేలకు పైగా పంచాయతీల్లో వైఎస్సార్ కాంగ్రెస్(ysrcp) మద్దతుదారులు విజయం సాధించారు. మూడు విడతల్లోనూ అధికార వైసీపీ సపోర్టర్స్ దే హవా కనిపించింది. మొదటి మూడు విడతల్లో జరిగిన ఎన్నికల్లో 7,869 పంచాయతీలు వైసీపీ సొంతంచేసుకుంది. చివరి విడత పోలింగ్ జరిగిన ప్రాంతాల్లో దాదాపు 80 శాతానికి పైగా స్థానాలు వైసీపీ సాధించింది.

చివరి విడత పంచాయతీ ఆదివారం జరిగాయి. నాలుగో విడతలో 2,743 సర్పంచ్‌ పదవులకు పోలింగ్ జరిగింది. సర్పంచ్‌(sarpanch) పదవులకు 7,475 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. నాలుగో విడతో 3,299 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. అయితే.. 554 చోట్ల సర్పంచ్‌ పదవులు ఏకగ్రీవమయ్యాయి. వైఎస్సార్‌ కడప(kadapa) జిల్లాలో రెండు చోట్ల అభ్యర్థులెవరూ నామినేషన్లు వేయలేదు. దీంతో 2,743 సర్పంచ్‌ స్థానాలకు పోలింగ్‌ జరిగింది.

స్టేట్ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్(nimmagadda ramesh) కు సర్కారుకు మద్య వివాదాల మధ్య ఈ ఎన్నికలు జరిగాయి. అయినా ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఎన్నికలు వద్దని వైఎస్సార్ కాంగ్రెస్, నిర్వహించి తీరుతానని నిమ్మగడ్డ ప్రసాద్ మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. ఈ కోర్టుల దాకా వెళ్లింది. చివరకు ఎన్నికల్లో పాజిటివ్ ఫలితాలు రావడంతో వైసీపీ భారీ సంబరాలు చేసుకుంది.

- Horoscope Telugu today : ఈ రాశుల వారికి వ్యాపారాలు కలిసివస్తాయి

- Shabnam ali : దేశంలోనే తొలిసారి ఓ మహిళకు ఉరి. ఎవరామె..?

- అయ్యా మోడీజీ... ఇది మీ ప్రభుత్వ పాపమే.. !

- ఆమె గాత్రం ఎంతో మధురమో.. ఆమె రూపం అంత అద్భుతం.. !

- ఈ నటి భర్త ఓ స్టార్ డైరెక్టర్ అన్న విషయం మీకు తెలుసా?

- జగన్‌‌‌కు షాక్ .. పార్టీ కంటే ముందే షర్మిల కొత్త టీవీ ఛానల్..!

Next Story
Share it