Top
Batukamma

బీజేపీ నినాదం ఎత్తుకున్న చంద్రబాబు!

బీజేపీ నినాదం ఎత్తుకున్న చంద్రబాబు!
X
Highlights

ఇది జరిగిన కొన్ని గంటల తర్వాత వేరువేరు ప్రాంతాల్లో హిందూ దేవాలయాల విగ్రహాల పైన దాడులు జరగడం పెద్ద సంచలనానికే దారి తీసింది. దీనితో ప్రతిపక్షం, విపక్షాలు అధికార వైసీపీ పైన బగ్గుమంటున్నాయి.

ఏపీలో వరుసగా హిందూ దేవాలయాల పైన దాడి జరగడం రాష్ట్రవ్యాప్తంగా పెద్ద చర్చకు దారీ తీసింది. రాష్ట్రంలోనే కాకుండా అటు దేశవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన పవిత్ర పుణ్యక్షేత్రం రామతీర్థంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఆలయ తాళాలు విరగ్గొట్టి లోపలికి వెళ్లి శ్రీరాముడి విగ్రహ శిరస్సును తొలగించి ఎత్తుకుపోయారు.

ఇది జరిగిన కొన్ని గంటల తర్వాత వేరువేరు ప్రాంతాల్లో హిందూ దేవాలయాల విగ్రహాల పైన దాడులు జరగడం పెద్ద సంచలనానికే దారి తీసింది. దీనితో ప్రతిపక్షం, విపక్షాలు అధికార వైసీపీ పైన బగ్గుమంటున్నాయి. రాష్ట్రంలో ప్రజలకే కాదు. దేవుళ్ళకు కూడా రక్షణ లేకుండా పోయింది అంటూ టీడీపీ నేతలు ప్రభుత్వం పైన నిప్పులు చెరుగుతున్నారు.


అందులో భాగంగానే టీడీపీ అధినేత చంద్రబాబు నాయిడు నిన్న రామతీర్ధంలో పర్యటించారు. ఘటనకి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రభుత్వం పైన తీవ్ర స్థాయిలో విరుచుకపడ్డారు. మతసామరస్యం దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని, ఇలాంటి ఘటనలు జరిగితే ఖబడ్డార్‌ అంటూ జగన్ ను, వైసీపీ ప్రభుత్వాన్ని బాబు హెచ్చరించారు.

అయితే ఇక్కడ బీజేపీ పాత్ర అంతా ఎలివేట్ కాలేదని చెప్పాలి. బేసిక్ ఇలా హిందూ దేవాలయాల పైన ఎలాంటి సంచలన వ్యాఖ్యలు చేసిన, ఎటువంటి దాడులు జరిగిన అక్కడ బీజేపే ముందుంటుంది. ముందునుంచి హిందుత్వాన్ని మెయిన్ ఎజెండాగా పెట్టుకొని ముందుకు వెళ్తున్న బీజేపీ.. ఈ ఇష్యూలో మాత్రం చాలా వరకు సైలెంట్ అయిపొయింది.


జై శ్రీరాం, మా శ్రీరాముడి పైన దాడులు చేస్తారా? అధికారంలో ఉండి మత మార్పిడిలు చేస్తారా? ఇవాళ అయోధ్యలో రామాలయం కడుతుంటే ఉత్తరాంధ్రలో శ్రీరాముడి తల నరకడం ఆమోద యోగ్యమేనా? శ్రీరాముడిని కాపాడలేకపోతే మీరు సీఎంగా ఉండి ఎందుకు? నేను రామతీర్ధంలో దేవుడ్ని కాపాడేందుకే వచ్చాను.. అధికారంలోకి వచ్చాక ప్రతి కేసును రీఒపెన్ చేస్తామంటూ బీజేపీ నినాదాలను ఎత్తుకున్నారు బాబు.
ఇక్కడ అని కాదు... ఆలయాల పైన దాడులు ఎప్పటినుంచో జరుగుతున్నాయి. కానీ బీజేపీ పార్టీ కానీ, అక్కడ ఉన్న నాయకులు కానీ ఈ స్థాయిలో ప్రభుత్వాన్ని ప్రశ్నించలేకపోయారు. బండి సంజయ్ లాంటి నాయకుడు ఏపీలో కూడా కచ్చితంగా కావాల్సిందేనన్నఅభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

రైతుల సమస్యల పైన ఆ మధ్య రెండు మూడురోజులు బాగానే హడావుడి చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఈ దాడుల గురించి ట్విట్టర్ లో తప్పా.. బయటకు వచ్చిమాట్లాడింది లేదు.. అసలే ప్రజల్లో ప్రస్తుతం వీక్ గా ఉన్న జనసేన.. ఇలాంటి టైంలో కూడా గళం విప్పకపోతే ఎలా అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Next Story
Share it