వకీల్ సాబ్ కి దిమ్మదిరిగే షాక్ ఇచ్చిన సీఎం జగన్..!

మూడేళ్ల తరవాత వకీల్ సాబ్ సినిమాతో ఈ రోజు థియేటర్ లోకి ఎంట్రీ ఇచ్చాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. తమ అభిమాన హీరో రీఎంట్రీ
మూడేళ్ల తరవాత వకీల్ సాబ్ సినిమాతో ఈ రోజు థియేటర్ లోకి ఎంట్రీ ఇచ్చాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. తమ అభిమాన హీరో రీఎంట్రీ సినిమా కావడంతో అభిమానులు థియేటర్ల వద్ద నానా హంగామా చేస్తున్నారు. పవన్ వచ్చాడు.. మిగతా హీరోలు తట్టా బుట్టా సర్దుకొడని కామెంట్స్ చేస్తున్నారు.
ఇదిలావుండగా వకీల్ సాబ్ సినిమాకి ఏపీ సర్కారు షాక్ ఇచ్చింది. కరోనా నేపధ్యంలో బెనిఫిట్ షోస్, స్పెషల్ షో లకి అనుమతి ఇవ్వలేదు..అంతేకాకుండా రేట్లు పెంచి అమ్మడానికి కూడా అనుమతి ఇవ్వలేదు. దీనితో చాలా చోట్లల్లో బెనిఫిట్ షోలు చాలా వరకు రద్దయ్యాయి. ఈ క్రమంలో ఆగ్రహం వ్యక్తం చేసిన పవన్ అభిమానులు ధర్నాకు దిగారు.
తిరుపతి శాంతి థియేటర్ పైన రాళ్లతో దాడి చేశారు. అటు తెలంగాణలో బెనిఫిట్ షోలకి, స్పెషల్ షో లకి, టికెట్ రేట్లు పెంచుకొని అమ్ముకోడానికి అనుమతులు ఇచ్చింది ప్రభుత్వం. దాదాపుగా ఒక్కో టికెట్ ధర 1500 పలుకుతుంది. కాగా దుబాయ్ లాంటి దేశాల నుంచి ఇప్పటికే సినిమా టాక్ వచ్చేసింది. ఫ్యాన్స్ కి పునకాలే అంటూ కామెంట్స్ పెడుతున్నారు ఫ్యాన్స్.