జగన్ సీఎం అయ్యాక.. హిందూ దేవాలయల పై జరిగిన దాడుల ఇవే!

ఏపీలో వరుసగా హిందూ దేవాలయాల పైన దాడి జరగడం పెద్ద సంచలనంగా మారింది. ఈ నేపధ్యంలో అధికార వైసీపీ పైన తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఏపీలో వరుసగా హిందూ దేవాలయాల పైన దాడి జరగడం పెద్ద సంచలనంగా మారింది. ఈ నేపధ్యంలో అధికార వైసీపీ పైన తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దేవాలయాలకు, దేవుళ్ళకే రక్షణ లేకుంటే ఇక మనుషులకి ఏం రక్షణ ఉంటుందని ప్రతిపక్ష పార్టీ టీడీపీ ఆరోపిస్తుంది.
అయితే ఇందులో రామతీర్ధం ఘటన పెద్ద ఇష్యూ కావడంతో జగన్ సీఎం అయ్యాక హిందూ దేవాలయాల పైన జరిగిన దాడుల ఇవే అంటూ ఓ లిస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
2019 నుండి హిందూ దేవాలయల పై దాడుల వివరాలు...
1. గుంటూరు దుర్గమ్మ గుడి ద్వoసం - 14 Nov 2019
2. పిఠాపురం ఆంజనేయ స్వామి గుడి 23 విగ్రహాలు ద్వoసం - 21 Jan2020
3.రొంపిచెర్ల వేణుగోపాల స్వామి గుడి విగ్రహాలు ధ్వంసం - 11 Feb 2020
4.ఉండ్రాజవరo మండలం సూర్యవుపాలం అమ్మవారి గుడి ముఖ ద్వారం
దుండగులు ధ్వంసం చేశారు - 13 Feb 2020
5.నెల్లూరు జిల్లా కొండబిట్రగుంటలో ప్రసన్న వెంకటేశ్వరా ఆలయ రధం దగ్ధం
- 14 Feb 2020
6.అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహ స్వామి రధo దగ్ధం - 6 Set 2020
7.విజయవాడ దుర్గమ్మ గుడి రధ వెండి సింహాలు చోరీ - 13 Sept 2020
8.కృష్ణాజిల్లా నిడమానూరులో సాయి బాబా విగ్రహాలు ధ్వంసం - 15 Sept 2020
9.ఏలేశ్వరం శ్రీ సీతారామాంజనేయ వ్యాయామ కళాశాలలో ఆంజనేయ స్వామి విగ్రహం ధ్వంసం - 16 Sept2020
10.గుంటూరు జిల్లా వెల్దుర్తి గ్రామం నుండి గుండ్లపాడు వెళ్లే దారిలో కొండపైన
ఉన్న నాగమయ్య గుడిలో దేవతా ప్రతిమలు ధ్వంసం - 16 sept 2020
11.కృష్నాజిల్లా వత్సవాయి మండలం మక్కపేట గయంలో కాసీ విశ్వేశ్వర ఆలయంలో తలుపులు., నంది విగ్రహం ధ్వంసం -- 17 sept 2020
12.విశాఖ జిల్లా చింతపల్లి గ్రామం చిలకల మామిడి విధి శివారులో
శివాలయంలో శివుడు విగ్రహాలు ధ్వంసం - 19 sept 2020
13.పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు నరసాపురం వెళ్లే రోడ్ మార్గంలో వున్న
అయ్యప్ప స్వామి మండపంలో అయ్యప్ప చిత్రపటాలు , విగ్రహం ద్వoసం - 20 sept 2020
14.కర్నూల్ జిల్లా పత్తికొండ పట్టణ మార్కెట్ యార్డ్ సమీపంలో వున్న
ఆంజనేయ స్వామి విగ్రహం ద్వoసం - 23 Sept 2020
15.నెల్లూరు జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీ తుమ్మూరు నందు ఆంజనేయస్వామి విగ్రహం ద్వoసం - 25 sept 2020
16.కర్నూల్ జిల్లా మంత్రాలయం మండలం వుగురు కి 2km దూరంలో వున్న
సుగని జలాషేయం దగ్గర వున్న శ్రీలక్ష్మి నరసింహ స్వామి దేవాలయంలో
నరసింహ స్వామి శేషపడగలు ద్వoసం - 5 0ct 2020
17.కర్నూల్ జిల్లా ఆదోనిలో ఓవర్ బ్రిడ్జి కింద వున్నా ఆలయంలో ఆంజనేయ
స్వామి విగ్రహం ధ్వంసం - 6 0ct 2020
18.గుంటూరు జిల్లా నరసరావు పేట శంకర మఠం సమీపంలో వున్న సరస్వతి
దేవి విగ్రహం ద్వoసం - 6 0ct 2020
19.తర్లుపాడు గ్రామం శ్రీ వీరభద్ర స్వామి దేవస్థాన గోపురం ధ్వంసం - 17 0ct 2020
20.యానాం బైపాస్, లచ్చిపాలెం గ్రామం, తూ.గో జిల్లాలో ఆంజనేయ స్వామి
వారి విగ్రహం ద్వంసం..
21. రామతీర్థం లో శ్రీ రామచంద్రుని శిరస్సు విచ్ఛిన్నం (తల) - 2020
22. పాడేరు ఘాట్‌లోని కోమాలమ్మ అమ్మవారి పాదాలు ధ్వంసం - 2020
23. మర్లబండ ఆంజనేయస్వామి ఆలయంలోని గోపురంలోని సీతారాముల విగ్రహాన్ని ధ్వంసం - 2 January 2021