Top
Batukamma

ఏపీలో భారీ అంబేద్కర్ విగ్రహం.. నమూనాలు ఇవే..!

ఏపీలో భారీ అంబేద్కర్ విగ్రహం.. నమూనాలు ఇవే..!
X
Highlights

ల్యాండ్‌ స్కేప్‌లో గ్రీనరీ బాగా ఉండాలని, అది ఏ మాత్రం చెడిపోకుండా చూడాలని ఆయన ఆదేశించారు.

biggest statue of ambedker in vijayawada: విజయవాడ స్వరాజ్‌ మైదాన్‌లో అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు పనులు వేగంగా జరుగుతున్నాయి. భారీ అంబేద్కర్‌ విగ్రహం, స్మృతివనానికి సంబంధించి రెండు రకాల ప్లాన్లను పవర్‌ పాయింట్ ప్రజెంటేషన్‌‌లో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చూపించారు అధికారులు.

నాగ్ పూర్‌లో ఉన్న అంబేడ్కర్‌ దీక్ష భూమి, ముంబైలో ఉన్న చైత్య భూమి, లక్నోలోని అంబేడ్కర్‌ మెమోరియల్, నోయిడాలోని ప్రేరణాస్థల్‌ ను అధికారులు చూపించారు. గ్యాలరీ ఆడిటోరియం ఎలా ఉంటుందనే దానిపైనా అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు.

పనులు ప్రారంభించాక 14 నెలల్లో పూర్తయ్యేలా ప్లానింగ్ రెడీ చేసినట్టు అధికారులు సీఎంకు చెప్పారు. అంబేద్కర్‌ స్మృతివనంలో ఏర్పాటు చేసే విగ్రహం దీర్ఘకాలం నాణ్యంగా ఉండాలని, స్ట్రక్చర్‌లో మెరుపు, కళ తగ్గకుండా ఉండాలని ఈ సందర్భంగా సీఎం వైయస్‌ జగన్‌ అధికారులకు సూచించారు..

ల్యాండ్‌ స్కేప్‌లో గ్రీనరీ బాగా ఉండాలని, అది ఏ మాత్రం చెడిపోకుండా చూడాలని ఆయన ఆదేశించారు.

అంబేద్కర్‌ (biggest statue of ambedke) స్మృతివనం దగ్గర లైబ్రరీ, మ్యూజియం, గ్యాలరీ ఏర్పాటుతో పాటు, ఆయన జీవిత విశేషాలు ప్రదర్శించాలని అధికారులను ఆదేశించారు.















Next Story
Share it