Top
Batukamma

పాపం సోము వీర్రాజు.. అయిపాయె..!

పాపం సోము వీర్రాజు.. అయిపాయె..!
X
Highlights

రచ్చ రచ్చ చేసి..తమ వర్గం మీడియాలో ఫుల్లుగా చూయించేసుకుని.. ఫుల్ గా సింపథి కొట్టేస్తున్నారు

Bjp performance in andhrapradesh : ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పుడు గుడుల చుట్టు తిరుగుతున్నాయి. వరుసగా ఆలయాల్లో విగ్రహాలు ధ్వంసం కావడం చర్చనీయాంశంగా మారింది. గతంలోనూ ఇలాంటి సంఘటనలు జరిగినా.. ఇప్పుడు మాత్రం ఇష్యూ కాస్త సీరియస్ అయ్యింది. ఇన్ని రోజులుగా ఖాళీగా ఉన్న చంద్రబాబుకు ఓ పని దొరికినట్టైంది.

ఇంత వరకు బాగానే ఉంది. దాడి జరిగింది హిందూ దేవాలయాలపై. సాధారణంగా ఇలాంటివి జరిగినప్పుడు ముందుగా రియాక్ట్ అయ్యేది బీజేపీనే(bjp). హిందూత్వానికి తమకు మాత్రమే పేటెంట్ ఉందని బీజేపీ నేతలు చెబుతుంటారు. అందుకే దేశవ్యాప్తంగా ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా.. ముందుగా వాళ్లే రియాక్ట్ అవుతారు. సోషల్ మీడియాతో పాటు బయట కూడా రచ్చ రచ్చ చేస్తారు.

కానీ ఏపీలో కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే పరిస్థితి మరోలా కనిపిస్తోంది. బీజేపీ టేకోవర్ చేయాల్సిన ఇష్యూను.. పూర్తిగా టీడీపీ(tdp) హైజాక్ చేసేసింది. ఆలయాల పరిరక్షణ కోసం తండ్రీకొడుకులిద్దరూ రంగంలోకి దిగారు. జగన్ సర్కారుపై దుమ్మెత్తి పోస్తున్నారు.

ఏపీలో రెండు దేవాలయాల్లో విగ్రహాలు ధ్వంసమైనా.. బీజేపీ ఎందుకింత లైట్ తీసుకుంటోంది అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కాస్తో కూస్తో హడావుడి చేస్తున్నా.. అది బీజేపీ పేరుకు తగ్గ స్థాయిలో మాత్రం కనిపించడం లేదు.

- జగన్ సీఎం అయ్యాక.. హిందూ దేవాలయల పై జరిగిన దాడుల ఇవే!

- బీజేపీ నినాదం ఎత్తుకున్న చంద్రబాబు!

- మన యాస, భాషలో లగ్గం కారట.. ఎట్లున్నదో సూడుర్రి!

దీనికంతటికి కారణం నాయకత్వ లోపమేననే వాదన వినిపిస్తోంది. పార్టీ స్టేట్ చీఫ్ గా ఉన్న సోము వీర్రాజు(somu veerraju).. అనుకున్నంత యాక్టీవ్ గా పనిచేయడం లేదనే మాట వినిపిస్తోంది. బీజేపీ అంటేనే దూకుడుగా వ్యవహరించడం.. తప్పైనా.. ఒప్పైనా.. ముందు హడావుడి చేసి వదిలేయాలి. కానీ సోము వీర్రాజు మాత్రం.. ఇటీవల చేసిన ట్వీట్ చూస్తే.. ఈయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడేనా అనే అనుమానం కలగక మానదు.

తెలంగాణలో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్(bandi sanjay) చూసిన ఏపీ ప్రజలు.. సోము వీర్రాజు పనితనం చూసి తలపట్టుకుంటున్నారట. తెలంగాణలో ఏ చిన్న సంఘటన జరిగినా.. దాన్ని రచ్చ రచ్చ చేసి..తమ వర్గం మీడియాలో ఫుల్లుగా చూయించేసుకుని.. ఫుల్ గా సింపథి కొట్టేస్తున్నారు బండి సంజయ్.


పనిలో పనిగా హిందూత్వానికి ప్రమాదం ఏర్పడిందనే.. వాదనను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లి.. యూత్ ఫాలోయింగ్ పెంచుకుంటున్నారు. ఈ స్ట్రాటజీతోనే ఇప్పుడు చాలా వరకు యూత్ ను తన వైపు తిప్పుకున్నారు బండి సంజయ్. అందుకే తెలంగాణలో టీఆర్ఎస్ కు టెన్షన్ పుట్టిస్తున్నారు.

రాబోయే ఎన్నికల సమయానికి ఏపీలో సత్తా చాటాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. ఇలాంటి టైంలో ఏపీ బీజేపీకి ఓ చురుకైన నాయకుడు.. మాటలతో జనాన్ని తన వైపు లాక్కునే లీడర్ కావాలనే మాట వినిపిస్తోంది.

అందుకే ఇప్పుడు రెండు రాష్ట్రాల పార్టీ అధ్యక్షులు ఢిల్లీలో నడ్డా(jagath prakash nadda)ను కలిశారట. సోము వీర్రాజు చేయలేని పనిని.. బండి సంజయ్ తో చేయిద్దామనే ఆలోచనలో ఉన్నారట. త్వరలోనే బండి సంజయ్ ఏపీలో పర్యటించబోతున్నారట. తిరుపతి పార్లమెంట్ స్థానం(tirupathi bypoll) ఉప ఎన్నిక కూడా ఉండటంతో.. బండి సంజయ్ ను ఏపీలో ప్రవేశపెట్టాల్సిందేనని పార్టీ అధినాయకత్వం ఫిక్స్ అయ్యిందట.

పనిలో పనిగా సంజయ్ ని చూసి నేర్చుకోవాలంటూ సోము వీర్రాజుకు చీవాట్లు కూడా పెట్టినట్టు సమాచారం. చూడాలి మరి సంజయ్ ఎంట్రీతో ఏపీ పాలిటిక్స్ ఏ మలుపు తిరుగుతాయో.

Next Story
Share it