Top
Batukamma

వివాహితపై కన్నేసిన టీడీపీ నేత.. నిద్రిస్తున్న ఆమెపై..

వివాహితపై కన్నేసిన టీడీపీ నేత.. నిద్రిస్తున్న ఆమెపై..
X
Highlights

ఆమెను ఎలాగైనా సరే లోబర్చుకోవాలని ప్రయత్నాలు చేస్తుండేవాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి తన భర్తతో కలిసి తన ఇంట్లో నిద్రిస్తున్న ఆమెపైకి శ్రీనివాసులు రాళ్లు విసిరి వెకిలిచేష్టలు చేశాడు.

వివాహిత పై కన్నేసిన టీడీపీ నేతను రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేశారు. ఆపై దిశా చట్టం కింద కేసు నమోదు చేశారు. ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. డి.హీరేహాళ్‌ మండలం దొడగట్టకు చెందిన టీడీపీ నేత శ్రీనివాసులు ఓ వివాహితపైన కన్నేశాడు.

ఆమెను ఎలాగైనా సరే లోబర్చుకోవాలని ప్రయత్నాలు చేస్తుండేవాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి తన భర్తతో కలిసి తన ఇంట్లో నిద్రిస్తున్న ఆమెపైకి శ్రీనివాసులు రాళ్లు విసిరి వెకిలిచేష్టలు చేశాడు.

అయితే ఈ విషయాన్నీ ఆమె తన భర్తకి చెప్పగా ఎవరక్కడ అని అడగగా అక్కడి నుంచి పారిపోయాడు. దీనితో గురువారం బాధితురాలు తన భర్తతో కలిసి స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది.

బాధితురాలు ఫిర్యాదు మేరకు క్రైం నంబర్‌ 358 అండర్‌ సెక్షన్‌ 534డి, 509 ప్రకారం కేసు నమోదు చేసిన పోలీసులు శ్రీనివాసులును రిమాండ్ కి తరలించారు.

అయితే అంతకుముందు శ్రీనివాసులు పైన రౌడీషీటర్‌ గా పేరుంది. గతంలో ఓ ఓ హత్య కేసులో ఏడేళ్ల జైలు శిక్ష అనుభవించిన చరిత్ర కూడా ఉంది. మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు పేరు చెప్పుకొని దౌర్జన్యాలకు పాల్పడుతుండేవాడని స్థానికులు అంటున్నారు.

Next Story
Share it