ఎన్టీవోడే కాదు.. ఆయన్ని బాబుగారు వెన్నుపోటు పొడిచారట..!

ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన ఒక ద్రోహి జీవితం ఆ రకంగా ముగిసింది.
ఎన్టీఆర్ ను అత్యంత దుర్మార్గంగా పదవి నుంచి దించివేయడానికి చంద్రబాబుకు తోడ్పడిన పరమ నీచుల్లో ఒకడు ఆనాటి గవర్నర్ కృష్ణకాంత్. అతగాడు ప్రజాధనంతో మహా విలాసవంతంగా రాజభవన్ లో జీవించేవాడు.
చంద్రబాబుతో సహా మరో నలుగురైదుగురుని మంత్రివర్గం నుంచి తప్పిస్తూ ఎన్టీఆర్ లేఖ పంపితే దాన్ని బుట్టదాఖలు చేసాడు ఆ యంగ్ టర్క్. అతనికి ముందుగా ఉపరాష్ట్రపతి, ఆ తరువాత రాష్ట్రపతి పదవులు ఆశలు చూపించాడు చంద్రబాబు.
ఆ తదుపరి పరిణామాల్లో కృష్ణకాంత్ కు ఉపరాష్ట్రపతి పదవి రావడంలో చంద్రబాబు సహకరించాడు. సాధారణంగా ఉపరాష్ట్రపతి తదుపరి రాష్ట్రపతి అయ్యే సంప్రదాయం మనకుంది. ఒకటి రెండు సార్లు మాత్రమే అలా జరగలేదు.
రాష్ట్రపతి పదవి దగ్గరకు వచ్చేసరికి అకస్మాత్తుగా అబ్దుల్ కలాం పేరు తెరపైకి వచ్చింది.
కలాం ను నేనే ప్రతిపాదించాను అని చంద్రబాబు చెప్పుకుంటాడు కానీ అది యదార్ధం కాదు. ఆయన పేరును ములాయం సింగ్ ప్రతిపాదించాడని గుర్తు. లేకపోతె మరొకరో.
కలాం పేరు ఖరారై ఆయన రేపు పదవీస్వీకారం చేస్తారనగా కృష్ణకాంత్ విపరీతమైన మానసిక వేదనకు గురై, ఆ వయసులో రాష్ట్రపతి పదవి దక్కలేదనే దుగ్ధతో గుండెపోటుతో మరణించాడు!
ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన ఒక ద్రోహి జీవితం ఆ రకంగా ముగిసింది.
ఎన్టీఆర్ కు జరిగిన ద్రోహం మామూలుది కాదు. అది ఒక భయంకరమైన కుట్ర. ఆ కుట్రలో అనేకమందిని భాగస్వాములను చేసాడు చంద్రబాబు .
వందలకోట్ల ఆస్తులను వారసత్వంగా పొందిన ఎన్టీఆర్ కుటుంబసభ్యులు కూడా ఈ కుట్రలో పాలుపంచుకోవడం మహా ఆశ్చర్యం. అందరూ అమ్ముడుపోయిన వెధవలే.
ఆ కుట్ర విజయవంతం కావడంతో డబ్బుతో ఈ లోకంలో ఎవరినైనా కొనవచ్చనే నమ్మకం చంద్రబాబులో స్థిరపడిపోయింది. ఎన్టీఆర్ మీద జరిగిన అంతఃపుర కుట్ర మీద ఎవరైనా పుస్తకం రాస్తే బాగుంటుంది.
Murali Mohana Rao Ilapavuluri