కమలా హ్యారీస్‌కు సీఎం జగన్ విషెస్!

డెమొక్రాట్లు కానీ, రిపబ్లికన్లు కానీ, రాజకీయాల సంగతి పక్కన పెడితే.. భారత మూలాలు కలిగిన కమలా హ్యారీస్ అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైనందుకు గర్వంగా ఉంది.
అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన భారతీయ సంతతికి చెందిన కమలా హ్యారీస్‌కు ఏపీ సీఎం జగన్ శుభాకాంక్షలు తెలియజేశారు.. ట్విటర్ వేదికగా సీఎం జగన్ స్పందిస్తూ.. '' డెమొక్రాట్లు కానీ, రిపబ్లికన్లు కానీ, రాజకీయాల సంగతి పక్కన పెడితే.. భారత మూలాలు కలిగిన కమలా హ్యారీస్ అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైనందుకు గర్వంగా ఉంది. కమలా హ్యారీస్‌కు శుభాకాంక్షలు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించటంతో పాటు ముందుకు నడిపించాలని కోరుకుంటున్నా'' అని జగన్ ట్వీట్ చేశారు..
Democrats or Republicans, politics apart, we are happy and proud to have in @KamalaHarris someone of Indian origin as the Vice President of America.
— YS Jagan Mohan Reddy (@ysjagan) November 8, 2020
Congratulations and best wishes. May God bless you and guide you.
ఇక ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయిడు కూడా చెందిన కమలా హ్యారీస్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు.. ఒక స్త్రీ ఆమె కావాలనుకుంటే ఏదైనా కావచ్చు!యునైటెడ్ స్టేట్స్ యొక్క మొట్టమొదటి వైస్ ప్రెసిడెంట్ ఎన్నుకోబడిన మహిళ కమలా హ్యారీస్‌కు నా శుభాకాంక్షలు.. ఆమె చారిత్రాత్మక విజయం భారతీయ-అమెరికన్లకు మరియు మనందరికీ ఎంతో గర్వకారణం అని చంద్రబాబు ట్వీట్ చేశారు.
A woman can be anything she wants to be! Congratulations to @KamalaHarris on becoming the first-ever woman Vice President-elect of the United States! Her historic achievement is a matter of great pride for Indian-Americans and for all of us. pic.twitter.com/80OGleqMCH
— N Chandrababu Naidu #StayHomeSaveLives (@ncbn) November 8, 2020